
ఆరు అడుగుల పుస్తకం ఆవిష్కరణ
గార:
తెలుగు భాషా విజ్ఞానానికి సంబంధించి ఆరు అడుగుల పెద్ద పుస్తకాన్ని బుధవారం ఉపాధ్యాయు లు, విద్యార్థులు ఆవిష్కరించారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా అంపోలు పంచాయతీ ఆడవరం ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం భోగెల ఉమామహేశ్వరరావు ఈ పుస్తకాన్ని తయారు చేశారు. వీటిలో అక్షర వర్ణమాల, గుణింత పేర్లు, పదాలు, పద్యాలు, గురజాడ, గిడుగు, వేమన వంటి సాహిత్య కవుల చరిత్రలు, పాఠశాల ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. పుస్తక జ్ఞానంలో మనిషి విద్యావంతుడు అవుతాడన్నారు.