
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
రాయగడ: రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయాలపాలయ్యారు. జిల్లాలోని చంద్రపూర్ సమితి ఖెలొపొడియా వద్ద శుక్రవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చంద్రపూర్ ప్రాథమిక ఆరొగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కొసం వారిని బరంపురం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. చంద్రపూర్ సమితి బిజాపూర్ పంచాయతీలొని ఖిలుండి గ్రామానికి చెందిన మిలిపావుగండ, శ్వేతొ పావుగండలు బైకుపై మునిగుడ వైపు వెళుతున్నారు. ఇదే సమయంలో కుట్రాగుడ నుంచి చంద్రపూర్ వైపు బైకులో వెళ్తున్న కిరణ్ మలిబిసొయి, తిక్తొ బెహరాలు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైకును బలంగా ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రగాయాలకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.