
బావిలో మునిగి ఇద్దరు యువకుల దుర్మరణం
రాయగడ : బావిలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు యువకులు ఊపిరాడక మృతి చెందారు. మృతులు చంద్రపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బందిరి గ్రామంలో బుధవారం తేతే టంగరంగ(25), చిత్తరంజన్ టంగరంగ(28)లుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకుతీశారు. కలిమావీధిలోని తాగునీటి బావిలో చెత్త పేరుకుపోవడంతో శుభ్రం చేసేందుకు చిత్తరంజన్, తేతేలు లోపలికి దిగారు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా ఊపిరాడక విలవిల్లాడారు. బయటకు రాలేకపొవడంతో మృతి చెందారు. ఎప్పటికీ బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

బావిలో మునిగి ఇద్దరు యువకుల దుర్మరణం