
ఘాట్ రోడ్డులో జారిపడిన భారీ యంత్రం
కొరాపుట్: కొరాపుట్–జయపూర్ పట్టణాల మధ్య జాతీయ రహదారి–26పై భారీ యంత్రం జారి పడింది. శనివారం వేకువ జామున దేవఘాట్ వద్ద కొరాపుట్ నుంచి వస్తున్న భారీ ట్రాలీ మలుపు వద్ద అదుపు తప్పింది. వేగంతో పక్కకు ఒరిగిపోయింది. దానిపై ఉన్న భారీ యంత్రం రోడ్డు మధ్యన పడింది. ఘటన జరిగి 14 గంటలైనా అధికారుల నుంచి స్పందన లేదు. రోడ్డుపై ఉన్న యంత్రాన్ని ఏదైనా వాహనం ఢీకొడితే మరో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ దీనిని తొలగించడం గానీ, ప్రమాద హెచ్చరిక గానీ లేకపోవడంతో వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డులో నిత్యం భారీ వాహనాలు తిరుగుతుంటాయి. యంత్రాన్ని తొలగించే లోపు వర్షం పడినా, చికటి పడినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

ఘాట్ రోడ్డులో జారిపడిన భారీ యంత్రం

ఘాట్ రోడ్డులో జారిపడిన భారీ యంత్రం