నవీన్‌కు 9వ సారి పట్టాభిషేకం
బిజూ ఆశయాలలో నడుస్తాం
తమ నాయకుడు దివంగత బిజూ పట్నాయక్ ఆశయాలలో తమంతా నడుస్తామని నవీన్ ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్ష పదవి స్వీకరించిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 2000–24 వరకు ప్రజలు ఇచ్చిన అవకాశంతో బీజేడీ పార్టీ ఒడిశా రాష్ట్రానికి చేసిన సేవ చరిత్రాత్మకం అని అన్నారు. ప్రస్తుతం కార్యకర్తలు పార్టీ ఉన్నతి కోసం పని చేయాలన్నారు. ప్రజల లోనికి వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేవలం కొద్ది ఓట్ల తేడాతో అనేక సీట్లు కోల్పోవడం ద్వారా అధికారం కోల్పోయామన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేయాలని విజ్ఞప్తి చేశారు. మనపై దుష్ప్రచారాలు చేయడం తప్ప, ప్రత్యర్థులకు మరేం పని లేదన్నారు.
అభినందనలు
వేదిక మీద ఉన్న నవీన్‌కి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పూలగుచ్ఛాలు, శాలువాలతో అభినందించారు. చాలా కాలం తర్వాత నాయకులు ఒకరినొకరు ఎదురు పడడంతో పలకరింపులతో ఆ ప్రాంతం కళకళ లాడింది. మహిళా నాయకులు ప్రత్యేకంగా నవీన్‌తో ఫొటోలు దిగారు.
కొరాపుట్: సార్వత్రిక ఎన్నికల తర్వాత వెలవెలబోయిన బీజేడీ పార్టీ రాష్ట్ర కార్యాలయం తొలిసారిగా కళకళలాడింది. శనివారం పార్టీ అధ్యక్షునిగా నవీన్ పట్నాయక్ 9వ సారి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంపై ముందుగా సమాచారం రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ ప్రెసిడెంట్‌లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు ముందే తరలి వచ్చారు.
దద్దరిల్లిన శంఖ్ భవన్..
పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి నవీన్ కారులో శంఖ్ భవన్ చేరుతున్నప్పుడు కార్యకర్తల నినాదాలతో శంఖ్ భవన్ దద్దరిల్లింది. పార్టీ ముఖ్య నేతలు వరుస క్రమంలో నించుని అధినేతకి స్వాగతం పలికారు. సమావేశ మందిరంలో ప్రేక్షకులు గ్యాలరీలో ముందు వరుసలో నవీన్ కూర్చున్నారు. పార్టీ ఎన్నికల రాష్ట్ర రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ప్రతాప్ కేసరి దేవ్ తొలుత ప్రసంగించారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి నవీన్ ఒక్కరే నామినేషన్ వేసినందున అధ్యక్షునిగా ప్రకటిస్తున్నానని చెప్పారు. వెంటనే శంఖ్ భవన్ చప్పట్లతో దద్దరిల్లింది. ప్రతాప్ కేసరి నవీన్ వద్దకు వచ్చి వేదిక మీదకు తీసుకొని వెళ్లారు.
నవీన్‌కు 9వ సారి పట్టాభిషేకం
నవీన్‌కు 9వ సారి పట్టాభిషేకం


