గవర్నమెంట్ డీఏవీ కాలేజ్‌గా పేరు మార్పు
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ కాలేజీని మరలా గవర్నమెంట్ డీఏవీ కాలేజీగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ట్రైబుల్ మ్యూజియంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురాం మచ్చో మాట్లాడుతూ 1967లో దయానంద ఆంగ్లో వేదిక్ (డీఏవీ) ద్వారా ఈ కళాశాల ఏర్పాటైందన్నారు. 13 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లి గవర్నమెంట్ కాలేజీగా మారిందని గుర్తు చేశారు. నాటి నుంచి పూర్వ విద్యార్థులు అనేక పోరాటాల ద్వారా పేరు మార్పు కోసం ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. ఉన్నత విద్యాశాఖమంత్రి సూరజ్ సూర్యవంశీకి వినతిపత్రాలు అందజేశారని గుర్తు చేశారు. తాను సైతం ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించడంతో ఎట్టకేలకు పాత పేరు వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఏవీ పూర్వ విద్యార్థులు, కొరాపుట్ మున్సిపల్ చైర్మన్ లలెటెందు రంజన్ శెఠి తదితరులు పాల్గొన్నారు.
గవర్నమెంట్ డీఏవీ కాలేజ్‌గా పేరు మార్పు


