భువనేశ్వర్, కటక్‌పై కాల వైశాఖి ప్రభావం
కొరాపుట్: రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌తో పాటు జంట పట్టణమైన కటక్‌పై కాల వైశాఖి విజృంభించింది. శుక్రవారం ఉదయం తీవ్రమైన ఉరుములు,మెరుపులతో గాలులు వీచి భారీ వర్షం పడింది. దాంతో కొద్ది గంటల పాటు జనజీవనం అల్లాడి పోయింది. అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ఉదయమే ఈ ప్రళయం చూసి ప్రజలు భయకంపితులయ్యారు.వెను వెంటనే ఒడ్రాఫ్,అగ్ని మాపక బృందాలు రంగంలోనికి దిగి చెట్లని తొలగించాయి. విద్యుత్ శాఖ సిబ్బంది వర్షంలోనే విద్యుత్ పునరుద్ధరించారు. బలంగీర్, డెంకనాల్, నబరంగ్‌పూర్ జిల్లాలలో కాల వైశాఖి ప్రభావంతో భారీ వర్షాలు పడ్డాయి.
భువనేశ్వర్, కటక్‌పై కాల వైశాఖి ప్రభావం


