రాష్ట్రపతి పాలన విధించాలి
పర్లాకిమిడి: పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై అత్యాచారాలు, దాడులు ఆపాలని, అక్కడ శాంతిభద్రతలు క్షీణించడం వలన రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ శ్రేణులు కోరాయి. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. హిందువులపై దాడులు జరుగుతున్నా, అక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ కమలకాంత పండాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు లోకనాథ మిశ్రా, అధ్యక్షుడు కై లాస్ చంద్ర గౌడో, కూర్మారెడ్డి, హరిమోహన్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి పాలన విధించాలి


