
విశ్రాంత ఉద్యోగుల ధర్నా
పర్లాకిమిడి: ఒడిషా రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు శాంతియుత ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు, పెన్షన్‌దారుల సంఘం అధ్యక్షుడు అశ్వినీ కుమార్ పాఢి, కార్యదర్శి సురేష్ చంద్ర బెహరా, బిచిత్రా నందబెబర్తా, ఈశ్వరమ్మ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాత పెన్షన్ పధ్ధతి (ఓ.పి.యస్.), ఎన్.పి.యస్., యు.పి.యస్.అని ప్రభుత్వం విభజించి ఉద్యోగుల మధ్య వ్యత్యాసాలు సృష్టించారని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌దారుల సమాఖ్య, ఒడిషా రాష్ట్ర రిటైర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్రంలో అన్ని జిల్లాలో నిరసన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.
అనంతరం కలెక్టర్‌కు గజపతి జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున వినతిపత్రాన్ని అందజేశారు.