7, 8 తేదీల్లో ఏఐవైఎఫ్ సభలు
జయపురం: మే 7, 8వ తేదీల్లో కొరాపుట్ టౌన్ హాలులో జరిగే ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్(ఏఐవైఎఫ్) మహాసభలు విజయవంతం చేయాలని రాష్ట్ర విభాగ అధ్యక్షుడు ప్రదీప్ శెట్టి, రాష్ట్ర సాధారణ కార్యదర్శి సత్య రంజన్ మహంతి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కార్మిక భవనంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి రోజు ర్యాలీ అనంతరం సభ ప్రారంభమవుతుందని, యూత్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఆర్.అరుణ మల్లయ రామన్న (తమిళనాడు), కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పండా, ఒడిశా రాష్ట్ర కార్యదర్శి ఆశిశ్ కనుంగో, బీహార్ రాష్ట్ర యువనేత విశ్వజిత్ కుమార్ తదితరులు ప్రసంగిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూత్ ఫెడరేషన్ రాష్ట్ర పరిషత్ సభ్యులు వికాశ ముదులి, జిల్లా నేతలు కుమార జాని, పవన్ మహురియ, అజిత్ పట్నాయక్, బుద్ర బొడొనాయిక్, ప్రమోద్ కుమార్ మహంతి, జుధిష్టర్ రౌళొ, రామకృష్ణదాస్, కామదేవ్ నాహక్ తదితరులు పాల్గొన్నారు.


