
గాయపడిన సర్పాలకు రక్షణ
కొరాపుట్: గాయాలపాలైన భయంకరమైన కోబ్రా పాములను స్నేక్ హెల్పర్లు రక్షించారు. శనివారం కొరాపుట్ జిల్లా జయపూర్ సమీపంలోని డొంగ్రురు చించి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిలుపదల చేసిన జేసీబీ వాహనంలో రెండు కోబ్రా పాములు బుసలు కొట్టడం స్థానికులు గమనించారు. వాటిని అదిలించడానికి ప్రయత్నం చేసినా పడగ ఎత్తుతూ బుసలు కొట్టాయి. జాగ్రత్తగా గమనిస్తే అవి యంత్రంలో చిక్కుకున్నాయని గమనించారు. వెంటనే జయపూర్ లో ఉన్న స్నేక్ హెల్పర్ కృష్ణ కేశవ షడంగి కి సమాచారం ఇచ్చారు. కేశవ తన టీమ్ సభ్యుడు చందన్ తో కలసి సంఘటన స్ధలానికి చేరుకున్నాడు. నేర్పుగా వాటిని బయటకు తీయగా ఒక సర్పంకి మెడ మీద, మరోక దానికి నడుం మీద తీవ్ర గాయాలు అయినట్లు గుర్తించారు. వెంటనే వాటిని పశువైద్యాధికారి శౌభ్యాగ్య వద్ద చికిత్స చేయించారు. అనంతరం వాటిని జయపూర్ రేంజ్ అటవీ శాఖా అధికారి సచ్చి పరిడాకి అప్పగించారు. కేశవ్ బృందాన్ని అటవీ శాఖ అధికారులు అభినందించారు. వాటిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచి కోలుకున్న తర్వాత అటవీ ప్రాంతంలో వదలి పెడతామని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు.

గాయపడిన సర్పాలకు రక్షణ

గాయపడిన సర్పాలకు రక్షణ