
యువతి హత్య కేసులో నిందితుడి అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి పరిధిలోని రంగాభంద్ గ్రామ అడవిలో ఇటీవల ఓ యువతి మృతదేహం లభ్యమైంది. మల్కన్‌గిరి పోలీసు ఐఐసీ రీగాన్‌కీండో కేసు దర్యాప్తు చేయగా.. ఆదివారం ఓ యువకుడిని అరెస్టు చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం పాండామ్‌కు చెందిన 23 ఏళ్ల ఉమేష్ నాగ్ మంగళదేయి నాగ్ (25) ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆమె గర్భవతి కాగా.. ఉమేష్ ఆమెను మల్కన్‌గిరి ఆస్పత్రికి వెళ్లి అబార్షన్ చేసుకోమని సూచించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మల్కన్‌గిరి సమితి ఛలాన్‌గూఢ గ్రామం వద్ద ఆమెను గొడ్డలితో నరికి హత్య చేసి మృతదేహాన్ని రంగాబంద్ అటవీ ప్రాంతంలో పడేశాడని ఎస్పీ వినోద్ పటేల్ తెలిపారు.

యువతి హత్య కేసులో నిందితుడి అరెస్టు