యోగాతో మానసిక ఉల్లాసం
రాయగడ: యోగాతో మానసిక ఉల్లాసం లభిస్తుందని సంబల్‌పూర్‌కు యోగా శిక్షకురాలు సులోచన అన్నారు. స్థానిక రైతుల కాలనీలోని నవ జీవన్ ట్రస్టులో ఆదివాసీ విద్యార్థులకు యోగాపై శిక్షణ శిబిరం ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగా చేయడం వలన కలిగే ప్రయోజనాలు తెలియజేశారు. ప్రతీ విద్యార్థి యోగాను నిత్యకృత్యంగా అభ్యసించాలన్నారు. యోగా వలన మెదడు చురుగ్గా పనిచేస్తుందని, ఆరోగ్యకరమైన శరీరం సొంతమవుతుందని తెలియజేశారు. ఆశ్రమాల్లోని విద్యార్థులకు నిర్వాహకులు యోగాపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో నవజీవన్ ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని తదితరులు పాల్గొన్నారు.


