
ఆక్రమణలు తొలగింపు
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కోట్‌పాడ్ పట్టణంలో భారీగా ఆక్రమణలు తొలగించారు. బుధవారం బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి కుసిమి రోడ్దులో ఉన్న అనేక నిర్మాణాలు కూల్చివేశారు. చాలాకాలంగా ఈ రోడ్డులో భారీగా ఆక్రమణలు జరిగాయి. దీంతో వాహనాలు వెళ్లడానికి ఇబ్బందులు పెరిగాయి. అనేక ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. పురపాలక శాఖ సిబ్బంది పెద్దఎత్తున పోలీసు బలగాలను ఉదయం మెహరించారు. కూల్చివేతలు గుర్తించిన నిర్మాణాల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారులు దూకుడుగా వ్యవహరించి కూల్చివేతలు కొనసాగించారు. దీంతో భయపడిన ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తమ నిర్మాణాలను తరలించడం ప్రారంభించారు. పలు హోర్డింగ్‌లు, సిమ్మెంట్ నిర్మాణాలు జేసీబీలతో కూల్చివేశారు.

ఆక్రమణలు తొలగింపు