
రైతుల కోసం రాజీలేని పోరాటం
కొరాపుట్: రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. శుక్రవారం కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి కట్రగుడ గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న వేధింపులకు నిరసనగా కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇకపై కూడా మహిళలు, రైతుల తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 80 శాతం మంది రైతులే ఉన్నారని, వారి సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ నెల 22 నుంచి రంగు మార్చి కొత్త రేషన్ కార్డుల పేరిట ప్రభుత్వం పంపిణీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.