
షైన్ అవార్డులకు సిక్కోలు విద్యార్థులు
శ్రీకాకుళం న్యూకాలనీ : సిక్కోలు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అదరహో అనిపించి స్టేట్ అవార్డులకు ఎంపికయ్యారు. వివిధ ప్రభుత్వ యాజమాన్య విద్యాసంస్థల్లో చదువుతూ టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు షైన్ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. టాపర్లను ఈ నెల 14, 15 తేదీల్లో విజయవాడ/గుంటూరులో సత్కరించేలా ఏర్పాట్లు చేసింది. ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని దామోదర స్వప్న ఎంపీహెచ్‌డబ్ల్యూ ఒకేషనల్ కోర్సులో 1000 మార్కులకు 989 మార్కులతో రాష్ట్రంలో టాపర్‌గా నిలిచింది. ప్రిన్సిపాల్ బి.శ్యామ్‌సుందర్, అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రాణించింది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థిని ఎ.సేవేంద్రకుమార్ సీజీఏ ఒకేషనల్ కోర్సులో 1000 మార్కులకు 958 మార్కులతో టాపర్‌గా నిలిచింది. ప్రిన్సిపాల్ పి.దుర్గారావు, అధ్యాపకులతో నిరంతరం ప్రోత్సాహంతో రాణించింది. బూర్జ మండలం ఓవీ పేట మోడల్ స్కూల్ విద్యార్థిని కర్ని ధరణి ఎంపీసీ జనరల్ కోర్సులో 1000 మార్కులకు 984 మార్కులు సాధించి శభాష్ అనిపించింది. ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసరావు, తల్లిదండ్రులు, పీజీటీల ప్రేరణ మరువలేనిదని చెబుతోంది.

షైన్ అవార్డులకు సిక్కోలు విద్యార్థులు

షైన్ అవార్డులకు సిక్కోలు విద్యార్థులు