
ముగిసిన శ్రీరామ నవమి ఉత్సవాలు
జయపురం: స్థానిక జమాల్ లైన్ శ్రీరామ మందిరంలో చేపట్టిన శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. దీనిలో భాగంగా ఉదయం పూర్ణాహుతి హోమం చేపట్టారు. అలాగే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు గోరపల్లి నాగరాజు, కార్యదర్శి సానా జగదీష్, ఉపాధ్యక్షుడు సీహెచ్ శేఖరరావు, సహాయ కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్, కోశాధికారి వారణాసి రమేష్, సభ్యులు బి.వెంకట రమణ, కళింగ వైశ్య కుల పెద్ద వారణాసి సత్యనారాయణ, వారణాసి శివప్రసాద్, ఎస్.ఈశ్వరరావు, ఎ.తిరుమలరావు, ఎస్.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.