40 యూనిట్ల రక్తం సేకరణ
పర్లాకిమిడి: స్థానిక డోలాట్యాంకు రోడ్డు సెయింట్ జోసెఫ్ కాథలిక్ చర్చిలో గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ పండుగ సందర్భంగా శనివారం రక్తదానం శిబిరంను ఫాదర్ అజిత్ కుమార్ నాయక్ ఏర్పాటుచేశారు. ఈ శిబిరానికి ఎస్పీ జితేంద్రనాథ్ పండా ప్రారంభించగా, జిల్లా ప్రజారోగ్య అధికారి డాక్టర్ రబినారాయణ దాస్, డాక్టర్ షబ్నా పర్వీన్, సీనియర్ ఫార్మసిస్టు ఖగేశ్వర బెహరా, పింకి పాఢి, జి.ప్రవీన్ సహకరించారు. పలువురు క్రైస్తవ సోదరులు స్వచ్ఛందంగా పాల్గొని మొత్తం 40 యూనిట్ల రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకుకు తరలించారు.
40 యూనిట్ల రక్తం సేకరణ
40 యూనిట్ల రక్తం సేకరణ


