
దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన 16 యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం నిషేధించింది. దేశ భద్రత, సమగ్రతలకు సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నందన ఈ నిర్ణయం తీసుకుంది. తాగాగా నిషేధం విధించిన ఛానళ్లలో 6 పాకిస్తాన్‌కి చెందినవి ఉన్నాయి. యూట్యూబ్ ఛానళ్లతో పాటు ఫేస్‌బుక్ అకౌంట్‌ని కేంద్ర ప్రసార శాఖ బ్లాక్ చేసింది.
తాజాగా నిషేధిత జాబితాలో చేరిన యూ ట్యూబ్ ఛానళ్లకు రికార్డు స్థాయిలో 68 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. భారీ స్థాయిలో చందాదారులను కలిగిన ఈ ఛానళ్లు అదే పనిగా భారత విదేశాంగ విధానం, అంతర్గత వ్యవహారాలు, దేశ సమగ్రతకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారాన్ని వెదజల్లుతున్నట్టు కేంద్ర ప్రసార శాఖ గుర్తించింది. దీంతో వాటిపై నిషేధం విధించింది.
నిషేధించిన యూట్యూబ్ ఛానళ్లు
ఎస్‌బీబీ న్యూస్, తహ్‌ఫుజ్ ఈ దీన్ ఇండియా, ది స్టడీ టైం, లేటెస్ట్ అప్‌డేట్, హిందీ మే దేఖో, డిఫెన్స్ న్యూస్ 24/7, టెక్నికల్ యోగేంద్ర, షైనీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ఆజ్ తే న్యూస్, ఎంఆర్‌ఎఫ్ టీవీ లైవ్ వంటి ఇండియా ఛానళ్లు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ బేస్డ్ ఛానళ్ల విషయానికి వస్తే బోల్ మీడియా బోల్, ఖైసర్ ఖాన్, ది వాయిస్ ఆఫ్ ఏషియా, డిస్కవర్ పాయింట్, రియాల్టీ చెక్, ఆజ్‌తక్ పాకిస్తాన్ ఛానళ్లు ఉన్నాయి. వీటితో పాటు తహ్‌ఫుజ్ ఈ దీన్ మీడియా సర్వీసెస్ ఇండియా అనే ఫేస్‌బుక్ అకౌంట్ కూడా ఉంది.
చదవండి: Truecaller: గూగుల్ షాకింగ్ నిర్ణయం..ఇకపై ట్రూకాలర్‌లో ఈ ఫీచర్ పనిచేయదు.
Comments
Please login to add a commentAdd a comment