YouTuber Grace Helbig Diagnosed With Triple Positive Breast Cancer - Sakshi
Sakshi News home page

Grace Helbig Breast Cancer Diagnosis: ప్రముఖ యూట్యూబర్‌కు బ్రెస్ట్ క్యాన్సర్.. ఎమోషనల్ వీడియో రిలీజ్!

Published Tue, Jul 4 2023 3:52 PM | Last Updated on Tue, Jul 4 2023 4:09 PM

youTuber Grace Helbig diagnosed with breast cancer - Sakshi

ప్రముఖ యూట్యూబ్ స్టార్, గ్రేస్ హెల్బిగ్ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఫుల్ ఎమోషనల్‌గా కనిపించింది గ్రేస్ హెల్బిగ్. 

(ఇది చదవండి: మహేశ్‌నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో)

ఆమెకు ప్రస్తుతం ట్రిపుల్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపింది. దాదాపు నెల రోజుల క్రితమే వైద్యులు నిర్ధారించినట్లు వెల్లడించింది. క్యాన్సర్ ఉందని తెలియడంతో షాక్‌కు గురైనట్లు పేర్కొంది. ఈ విషయాన్ని తాను మొదట నమ్మలేకపోయానంటూ ఎమోషనల్ అయింది.  

తన ఇన్‌స్టాలో రాస్తూ..' దాదాపు నెల రోజుల క్రితం నాకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయం తెలిసి నేను కూడా షాకయ్యా. అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ప్రస్తుతానికి బాగానే ఉన్నా. నాకు భర్త,ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మద్దతుగా నిలుస్తున్నారు. డాక్టర్లు కూడా నాకు ధైర్యం చెప్పారు. రొమ్ము క్యాన్సర్‌ను జయించి త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తా.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. హెల్బిగ్ యూట్యూబ్ ఛానెల్‌కు 2.6 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 

(ఇది చదవండి: బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్‌ను ఢీ కొడుతున్న ప్రభాస్..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement