
ఆమెక్కొతే టీచర్.. 70 వేలమంది విద్యార్థులు
ఆమెక్కొతే ఉపాధ్యాయిని.. 70 వేలమంది విద్యార్థులు. ఆ విద్యార్థుల్లో ఏ ఒక్కరికీ ఆందోళన ఉండదు. పరీక్షలన్న చింత అస్సలు దరిచేరదు. కారణం ఆ ఉపాధ్యాయిని ఆలోచనలు వారిముందు సమస్యలనీ ఛేదించేందుకే పుడతాయి.
ఒక్కసారి ఈ విషయం తెలుసుకుంటే ప్యాషన్ అంటే ఇదే అనిపించక మానదు. ఎందుకంటే ఆమెక్కొతే ఉపాధ్యాయిని.. 70 వేలమంది విద్యార్థులు. ఆ విద్యార్థుల్లో ఏ ఒక్కరికీ ఆందోళన ఉండదు. పరీక్షలన్న చింత అస్సలు దరిచేరదు. కారణం ఆ ఉపాధ్యాయిని ఆలోచనలు వారిముందు సమస్యలనీ ఛేదించేందుకే పుడతాయి. పోని నిజానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయినా అంటే అదేం కాదు. అప్పటికే తాను చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదులుకొని తనకుతాను నిర్ణయం తీసుకుని టీచర్గా మారి చేసిన సాహసం. ఆమె పేరే రోషిణి ముఖర్జీ.
చిన్నతనం నుంచి టీచర్ కావాలని కోరికకు మధ్యలో బ్రేక్ పడింది. పీహెచ్డీ చేసి బోధనారంగంలో అడుగుపెడదామనుకున్న ఆమె తండ్రి చనిపోవడంతో చదువు ఆపేసి ఓ ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. చివరకు ఆమె ప్యాషన్ నిద్ర పోనివ్వకపోవడంతో ఉద్యోగం వదిలి ఎట్టకేలకు బోధనా రంగం వైపు మళ్లింది. ఆమె నిజంగా టీచింగ్ ఫీల్డ్లో ఎంత దూసుకెళ్లారంటే రాకెట్ వేగంతో.
సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని యూట్యూబ్ చానెల్ ద్వారా మొత్తం 70,000 వేలమంది విద్యార్థులను సంపాధించుకుంది. 9వ తరగతి నుంచి 12 వతరగతి విద్యార్థులకు సంబంధించిన బోధనాంశాలతో మొత్తం 3,900 వీడియోలను యూట్యూబ్లో అందుబాటులో ఉంచింది.
2011లో ఎగ్జామ్ ఫియర్ డాట్ కామ్
ఫిజిక్స్ విభాగంలో మాస్టర్ డిగ్రీ సాధించిన రోషిణి ముఖర్జీ 2011లో ఎగ్జామ్ ఫియర్ డాట్ కామ్ అనే ఆన్ లైన్ వెబ్ సైట్ను ప్రారంభించింది. దీనికి యూట్యూబ్ లింక్ చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పాఠ్యాంశాలను విద్యార్థులకు ఉచితంగా అందించడం ప్రారంభించింది. అనతికాలంలోనే ఈ వెబ్సైట్ను సందర్శించేవారి సంఖ్య పెరిగి ప్రస్తుతం 70 వేలమంది విద్యార్థులు క్లాసు రూముల్లో బోధించిన పాఠాలకు సంబంధించి ఎలాంటి అనుమానాలున్న రోషిణి సహాయంతో బయటపడుతున్నారు. ఎగ్జామ్స్ అంటే మాకు ఎలాంటి భయం లేదని చెప్తున్నారు.
'నాకున్న పవిత్రమైన ప్యాషన్ ఎగ్జామ్ ఫియర్ను ప్రారంభించేలా చేసింది. చాలా పాఠశాలలు నాణ్యమైన విద్యను ఎక్కువ ఖర్చుచేస్తే తప్ప అందించడం లేదని నాకు తెలిసింది. అలాగే, తక్కువ ఖర్చుతో దొరికే విద్యలో నాణ్యత లేదని కూడా తెలిసింది. అందుకే ట్యూషన్ ఫీజులు భరించలేని పేద విద్యార్థుల కోసం ఈ సైట్ ప్రారంభించాను' అని రోషిణి చెప్పింది.