సినీనటులు నరేశ్, పవిత్రాలోకేశ్
సాక్షి, హైదరాబాద్: సినీనటులు నరేశ్, పవిత్రా లోకేశ్‌ల వ్యక్తిగత జీవితంపై పలు వార్తలను టెలికాస్ట్ చేసిన ‘ఇమండి రామారావు’ చానల్ జర్నలిస్టు రామారావుకు సైబర్‌క్రైం పోలీసులు నోటీసులు జారీచేశారు. తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర ఇటీవల సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు రామారావుకు నోటీసులిచ్చారు. మరిన్ని చానళ్లు కూడా ఈ వార్తలను ప్రసారం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారికి కూడా నోటీసులిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వార్తల వెనుక రమ్య రఘుపతి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆమెకు కూడా నోటీసులిచ్చేందుకు వెనుకాడబోమని సైబర్‌క్రైం పోలీసులు తెలిపారు.
చదవండి: అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నాను: ఐశ్వర్యా లక్ష్మీ
Comments
Please login to add a commentAdd a comment