
సాక్షి, హైదరాబాద్ : సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్ సీజన్ 2లో రన్నరప్‌గా నిలిచిన గీతామాధురి కొన్ని యూట్యూబ్ చానెళ్లపై ఆగ్రహంగా ఉన్నారు. తప్పుడు వార్తలు ప్రెజెంట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లకి గీతామాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఫేక్ వీడియోలు, తప్పుడు వార్తలు పెట్టినందుకు కొన్ని యూట్యూబ్ చానెళ్ల మీద కొద్ది రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నానని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందు ఆ వీడియోలను తీసివేయడానికి, సదరు యూట్యూబ్ ఛానెళ్లకి కొంత సమయం ఇస్తున్నానని పేర్కొన్నారు. ‘మహా అయితే ఓ రోజు బాధపడతానేమో తర్వాత సంతోషం, ప్రశాంతత నాదే’ అంటూ పోస్ట్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment