![Popular YouTuber Amit Bhadana Biography, Annual Income and Net Worth - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/10/YouTuber%20Amit%20Bhadana.jpg.webp?itok=h7HDspmU)
గాంధీ అనే యువకుడు (చిరంజీవి) ఓ నిరుద్యోగి. ఒక రోజు పేపర్లో ఉద్యోగ ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వెళ్తాడు. అక్కడ యజమాని రామ్మోహన్ రావు (రావు గోపాలరావు) డబ్బు అహంకారంతో అతడిని అవమానిస్తాడు. దాంతో చిరంజీవి ఓ ఛాలెంజ్ చేస్తాడు. అది ఏంటంటే 'ఐదు సంవత్సరాలలో 50 లక్షల రూపాయలు సంపాదించి చూపిస్తానని ఆ తరువాత చట్టబద్దంగా 50 లక్షల రూపాయలు సంపాదించి చూపెడతాడు. ఓ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపిస్తాడు. ఆ ఛాలెంజ్ నిలుపుకునే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు చిరంజీవి. ప్రతి నాయకుడి పాత్రలో రావు గోపాలరావు నటన మరచిపోలేం. సినిమాలోలా ఛాలెంజ్ లు, గట్రా కాకుండా చట్టబద్దంగా డబ్బులు సంపాదించవచ్చా'అంటే అవుననే అంటున్నాడు 27ఏళ్ల యువకుడు. అలా అనడమే కాదు. నిరూపిస్తున్నాడు కూడా. దిగ్గజ సంస్థల సీఈఓలకు వచ్చే వేతనాలకు సరిసమానంగా అర్జిస్తున్నాడు.
ప్రస్తుతం కోవిడ్ కారణంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగంతో పాటు ప్రత్యామ్నాయంగా డబ్బులు సంపాదించడం చాలా అవసరం. అందుకే టెక్నాలజీని ఉపయోగించి యూట్యూబ్ ద్వారా డబ్బు ఈజీగా సంపాదించవచ్చని నిరూపిస్తున్నాడు. అంతేందుకు తాను నిద్రపోతున్నా తన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుందని చెబుతున్నాడు. అయితే ఆ బ్యాంక్ లెక్కలతో పాటు ఈ 27 ఏళ్ల యువకుడి యూట్యూబ్ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం. పదండి..!
ట్రెడీషనల్ జాబ్స్‌ను సెలక్ట్ చేసుకోవడం, రిటైర్ అయ్యేదాకా అదే జాబ్‌లో కొనసాగే రోజులు పోయాయి. కంటెంట్ ఉంటే చాలు కటౌట్‌తో పనిలేకుండా యూట్యూబర్‌లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ప్రముఖ టెక్ కంపెనీల సీఈఓ'ల కంటే ఎక్కువగానే డబ్బులు సంపాదిస్తున్నారు. అంతేకాదు కోట్లాది మంది అభిమానులతో ఆన్‌లైన్ స్టార్స్‌గా కీర్తిప్రతిష్టలు సంపాదిస్తున్నారు. అలాంటి కోవకే చెందుతాడు 27 అమిత్ భదనా. ఇతనో యూట్యూబ్ క్రియేటర్. ఒక్క వీడియోతో లక్షలు సంపాదిస్తాడు. అతని ఆస్తులు కోట్లలో ఉన్నాయని యూట్యూబ్ లెక్కలు చెబుతున్నాయి.
అమిత్ భదానా ఎవరు?
అమిత్ భదానా 27 ఏళ్ల యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. సౌత్ ఢిల్లీకి చెందిన జోహ్రీపూర్ నివాసి. పాఠశాల విద్యను యమునా బీహార్ పాఠశాలలో, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. ప్రస్తుతం అమిత్ 'అమిత్ భదానా' అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఎంటర్‌టైన్మెంట్ వీడియోస్‌ను అప్‌లోడ్ చేస్తున్నాడు. అలా అప్‌లోడ్ చేసిన వీడియోలకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. వాటికి వచ్చే వ్యూస్, డిస్‌ప్లే అయ్యే యాడ్స్ కారణంగా భారీ మొత్తంలో డబ్బుల్ని సంపాదిస్తున్నాడు.
2017లో ప్రారంభం
అమిత్ భదానా తన పేరుతోనే యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించాడు. అక్టోబర్ 24, 2012న ఛానెల్‌ని ప్రారంభించినా 2017వరకు ఎలాంటి వీడియోలు పెట్టలేదు. కానీ 'ఎగ్జామ్ బీ లైక్ బోర్డ్ ప్రిపరేషన్ బీ లైక్' పేరుతో తొలి వీడియోను 2017లో అప్‌లోడ్ చేశాడు. అలా ప్రారంభమైన ఛానల్‌కు ఇప్పుడు 23.5 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.
అమిత్ భదానా సంపాదన
మీడియా నివేదికల ప్రకారం, అమిత్ భదానా తన యూట్యూబ్‌లో పోస్ట్ చేసే ప్రతి వీడియోకి రూ. 10 లక్షలు సంపాదిస్తాడు. అమిత్ తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా సంపాదిస్తున్నాడు.
అమిత్ భదానా నికర ఆస్తి
ఒక్కో వీడియోకి రూ.10 లక్షలకు పైగా సంపాదిస్తున్న అమిత్ భదానా నికర ఆస్తి కాకుండా, మొత్తం నికర ఆస్తి దాదాపు రూ. 52 కోట్లుగా ఉంది.
చదవండి: ఇదేం యాపారం సామి..! జీన్స్ కొంటే ఫోన్ ఫ్రీ..టెక్ దిగ్గజం కొత్త ఐడియా
Comments
Please login to add a commentAdd a comment