Photo Credits: Nutty Instagram
తన డ్యాన్స్ వీడియోలతో అభిమానుల్లో క్రేజ్ తెచ్చుకుంది. యూట్యూబ్‌లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. చివరికి వీదేశీ మారకపు వ్యాపారం పేరుతోవేలాది మంది అభిమానులను నట్టేట ముంచింది. తమ పెట్టుబడులపై భారీ రాబడి ఇప్పిస్తానని మాటిచ్చి సుమారు 55 మిలియన్ డాలర్లకు(భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 437కోట్లు) కుచ్చుటోపీ పెట్టింది. వివారల్లోకి వెళితే..
(Photo Credits: Nutty Instagram)
థాయ్‌లాండ్‌కు చెందిన నత్తమోన్ ఖోంగోచక్ అనే యుయవతి తన డ్యాన్స్ వీడియోలు యూట్యూబ్‌లో పోస్టు చేయడం ద్వారా లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ముద్దుగా నట్టి అని పిలుచుకునే ఈ బ్యూటీకి ప్రస్తుతం 8,44,000 ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్‌గా ఎదిగింది. అంతేగాక తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఔత్సాహిక ఫారెక్స్ వ్యాపారుల కోసం ప్రైవేట్ కోర్సులకు ప్రచారం కూడా చేపట్టింది. దీని ద్వారా ఆమె పొందిన లాభాలను సైతం పోస్టు చేసింది.
(Photo Credits: Nutty Instagram)
అయితే విదేశీ మారకంలో పెట్టుబడి పెడితే 35 శాతం అధికంగా లాభాలు వస్తానని అభిమానులను, ఫాలోవర్లను నమ్మించింది. నట్టి మాటలను నమ్మిన ఆమె ఫాలోవర్స్ దాదాపు 6వేల మంది డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. అయితే ఉన్నట్టుండి నట్టి తన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. మే నెలలో పెట్టుబడిదారులకు తాను 1 బిలియన్ భాట్ (27.5 మిలియన్ డాలర్లు) బకాయిపడ్డానని చెప్పింది.
చదవండి: పెళ్లి కోసం నడి రోడ్డులో వధూవరుల ఛేజింగ్.. వీడియో వైరల్
(Photo Credits: Nutty Instagram)
అంతేగాక బ్రోకర్‌గా వ్యవహరించిన వ్యక్తి గత మార్చి నుంచి తన ట్రేడింగ్‌ను ఖాతాను, నిధులను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. ఫాలోవర్స్‌ను మోసం చేయడం తన ఉద్ధేశ్యం కాదని త్వరలోనే వారి పెట్టుబడులు తిరిగి చెల్లించేందకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. అయితే అధిక మొత్తంలో లాభాలు ఇప్పిస్తానని మాటిచ్చి.. నట్టి మోసం చేసిందని బాధితులు థాయ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు 102 మంది 30 మిలియన్ భాట్‌లు(6 కోట్ల 50 వేలు) కోల్పోయినట్లు ఫిర్యాదు చేయగా.. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని పోలీసులు తెలిపారు.
(Photo Credits: Nutty Instagram)
మరోవైపు నట్టిని అరెస్ట్ చేసేందుకు థాయిలాండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో గత వారం వారంట్ జారీ చేసింది. అయితే జూన్ నుంచి నట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడంతో ఆమె దేశం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు. కానీ ఇమ్మిగ్రేషన్ రికార్డుల ద్వారా ఆమె థాయ్‌లాండ్ విడిచి వెళ్లలేదని తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment