న్యూఢిల్లీ: భారత్‌పై ఎప్పుడూ విషం కక్కే పాకిస్తాన్.. డిజిటిల్ మీడియా ద్వారా మరోసారి దుస్సాహాసానికి ఒడిగట్టింది. ఇంటర్నెట్‌ను వాడుకుంటూ యూట్యూబ్ ద్వారా నకిలీ వార్తలను ప్రసారం చేసి భారత్‌ను అభాసుపాలు చేయాలనే యత్నం చేసింది. భారత్ కు సంబంధించిన సున్నితమైన విషయాల గురించి నకిలీ వార్తలను వ్యాప్తి చేసి భారత్‌ను దెబ్బకొట్టాలని చూసింది.
కాగా, భారత ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలు సమన్వయంగా వ్యవహరించి పాకిస్తాన్ డిజిటల్ కుట్రను వెలికి తీశాయి. యూట్యూబ్‌లోని 20 చానెల్‌తో పాటు భారతదేశానికి వ్యతిరేక ప్రచారం, నకిలీ వార్తలను వ్యాప్తి చేసే 2 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కశ్మీర్ అంశం, ఇండియన్ ఆర్మీ, భారతదేశంలోని మైనారిటీ కమ్యూనిటీలు, రామమందిరం, జనరల్ బిపిన్ రావత్ మొదలైన అంశాలపై తప్పుడు కంటెంట్‌ను ఈ చానెల్స్, వెబ్‌సైట్‌లు ప్రసారం చేశాయి. ఈ యూట్యూబ్ చానళ్ళకు మొత్తంగా 35 లక్షల కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment