ఒకప్పుడు డబ్బు సంపాదించాలంటే తక్కువ మార్గాలు మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు అందిపుచ్చుకోవాలే గానే బోలెడన్ని అవకాశాలు మన ముందు ఉంటాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే లక్ష్మీ దేవి మన ఇంట్లోకి వస్తుంది. యూట్యూబ్ ఒకప్పుడు ఇది ఎవరికి తెలియని పేరు కానీ, స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగి పోయిన తర్వాత ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో ఈ యాప్ ఉంటుంది. యూట్యూబ్ ఇప్పుడు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు.. ఆదాయాన్ని అందించే బంగారు గని.
అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించే క్రియేటివిటీ ఉండి, అందరినీ ఆకట్టుకునే నైపుణ్యం ఉండేలే గాని ఇందులో ఊహించని డబ్బు సంపాదించవచ్చు. కొంతమంది వీటిని నిజం చేసి చూపిస్తున్నారు కూడా. ప్రస్తుతం యూట్యూబ్‌లో సొంతంగా చానెల్ కలిగి ఉండి.. దాని ద్వారా ఇంట్లో కూర్చునే చాలా మంది కోట్లలో ఆదాయం సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో దేశంలోని టాప్-10 యూట్యూబర్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.
(చదవండి: రిలయన్స్‌తో డీల్ క్యాన్సల్..! భారత్‌ను వదులుకునే ప్రసక్తే లేదు...!)
1.గౌరవ్ చౌదరి
గౌరవ్ చౌదరి అక్టోబర్ 18, 2015న తన యూట్యూబ్ ఛానెల్ 'టెక్నికల్ గురూజీ'ని ప్రారంభించారు. ఈ టెక్నికల్ గురూజీ నికర విలువ 2021 నాటికి 45 మిలియన్ డాలర్లు(సుమారు రూ.334 కోట్లు). ఈ యూట్యూబర్ తన చానెల్ ని యూఏఈ కేంద్రంగా నడిపిస్తున్నాడు. అతను ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో కూడా చేరాడు. ఈయనకు రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 1) టెక్నికల్ గురూజీ - 21.6 మిలియన్ చందాదారులు, 2) గౌరవ్ చౌదరి- 4.99 మిలియన్ చందాదారులు ఉన్నారు. గౌరవ్ చౌదరి 1991 మే 7న రాజస్థాన్ లోని అజ్మీర్ లో జన్మించారు.
2. అమిత్ భదానా
ప్రముఖ యూట్యూబర్ అమిత్ భదానా 2021లో తన యూట్యూబ్ చానెల్ నికర విలువ 6.3 మిలియన్ డాలర్లు(సుమారు. రూ.46 కోట్లు). ఈ ఢిల్లీ భదానాకు యూట్యూబ్లో 22 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు.
3. నిషా మధులిక
నిషా మధులిక 1959లో ఉత్తరప్రదేశ్ రాష్టంలో జన్మించింది. ఈమె యూట్యూబ్ చానెల్ నికర విలువ 4.47 మిలియన్ డాలర్లు(సుమారు రూ.33 కోట్లు). ఈమె యూట్యూబ్ చానెల్‌కి 12.1 మిలియన్ల చందాదారులు ఉన్నారు. తన 'నిషామధులిక' యూట్యూబ్ చానెల్‌ని 2009లో ప్రారంభించింది.
4. క్యారీ మినాటీ
క్యారీ మినాటీ 1999లో హర్యానా రాష్టంలో జన్మించాడు. తన యూట్యూబ్ చానెల్ నికర విలువ 4 మిలియన్ అమెరికన్ డాలర్ల(సుమారు రూ.29 కోట్లు). క్యారీ మినాటీ యూట్యూబ్ చానెల్‌కి 33 మిలియన్ల చందాదారులు ఉన్నారు. తన 'క్యారీ మినాటీ' యూట్యూబ్ చానెల్‌ని 2014లో ప్రారంభించాడు. ఏప్రిల్ 2020లో ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో ఉన్నాడు.
5. ఆశిష్ చంచ్లానీ
క్యారీ మినాటీ 1993లో మహారాష్ట్రలో జన్మించాడు. తన యూట్యూబ్ చానెల్ నికర విలువ 4 మిలియన్ అమెరికన్ డాలర్ల(సుమారు రూ.29 కోట్లు). ఆశిష్ చంచ్లానీ వైన్స్ యూట్యూబ్ చానెల్‌కి 26.9 మిలియన్ల చందాదారుల ఉన్నారు. తన 'ఆశిష్ చంచ్లానీ వైన్స్' యూట్యూబ్ చానెల్‌ని 2009లో ప్రారంభించాడు.
6. భువన్ బామ్
భువన్ బామ్ 1994లో గుజరాత్ రాష్టంలో జన్మించాడు. తన యూట్యూబ్ చానెల్ 'బిబి కి వైన్స్' నికర విలువ 3 మిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు రూ.22 కోట్లు). 'బిబి కి వైన్స్' యూట్యూబ్ చానెల్‌కి 23.6 మిలియన్ల చందాదారులు ఉన్నారు. తన 'బిబి కి వైన్స్' యూట్యూబ్ చానెల్‌ని 2015లో ప్రారంభించాడు.
7. సందీప్ మహేశ్వరి
సందీప్ మహేశ్వరి చాలా ప్రజాదరణ పొందిన మోటివేషనల్ స్పీకర్. ఇతను 1980 సెప్టెంబరు 28న న్యూఢిల్లీలో జన్మించారు. తన యూట్యూబ్ చానెల్ 'సందీప్ మహేశ్వరి' నికర విలువ 3 మిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు రూ.22 కోట్లు). 'సందీప్ మహేశ్వరి' యూట్యూబ్ చానెల్‌కి 21.4 మిలియన్ల చందాదారులు ఉన్నారు. తన 'సందీప్ మహేశ్వరి' యూట్యూబ్ చానెల్‌ని 2012లో ప్రారంభించాడు.
8. ఎమివే బంటాయ్
ఎమివే బంటాయ్ అసలు పేరు బిలాల్ షేక్. బిలాల్ షేక్ 1995 నవంబరు 13న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించాడు. తన యూట్యూబ్ చానెల్ 'ఎమివే బంటాయ్' నికర విలువ 2.5 మిలియన్ డాలర్లు(సుమారు. రూ.18 కోట్లు). 'ఎమివే బంటాయ్' యూట్యూబ్ చానెల్‌కి 16.7 మిలియన్ల చందాదారులు ఉన్నారు. తన 'ఎమివే బంటాయ్' యూట్యూబ్ చానెల్‌ని 2013లో ప్రారంభించాడు.
9. హర్ష్ బెనివాల్
హర్ష్ బెనివాల్ 1996లో న్యూఢిల్లీలో జన్మించాడు. తన యూట్యూబ్ చానెల్ 'హర్ష్ బెనివాల్' నికర విలువ 2.2 మిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు. రూ.16 కోట్లు). 'హర్ష్ బెనివాల్' యూట్యూబ్ చానెల్‌కి 13.7 మిలియన్ల చందాదారులు ఉన్నారు. తన యూట్యూబ్ చానెల్‌ని 2015లో ప్రారంభించాడు.
10. విద్యా అయ్యర్
విద్యా అయ్యర్ 1990లో తమిళనాడు రాష్టంలో జన్మించింది. ఈమె యూట్యూబ్ చానెల్ 'విద్యా వోక్స్' నికర విలువ 1.13 మిలియన్ డాలర్లు(సుమారు రూ.9 కోట్లు). ఈమె యూట్యూబ్ చానెల్‌కి 7.46 మిలియన్ల చందాదారులు ఉన్నారు. తన 'విద్యా వోక్స్' యూట్యూబ్ చానెల్‌ని 2014లో ప్రారంభించింది. ఈ యూట్యూబర్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో స్థిరపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment