ఏ వస్తువు తయారు చేసినా దాన్ని విక్రయించాలంటే సరైన ప్రచారం అవసరం. మేలైన వస్తువులు ఉత్పత్తి చేస్తోన్న కంపెనీలైనా సరే వాటి స్తోమతకు తగిన ప్రచారకర్తలను నియమించుకుంటాయి. కొన్ని పెద్ద కంపెనీలు సినీ తారలు, క్రికెట్లు, పాపులర్ వ్యక్తులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుని ప్రచారం సాగిస్తుంటాయి. కానీ క్రమంగా ఆ ట్రెండ్ మారుతుంది. ప్రముఖ కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను మరింత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు సామాజిక మాధ్యమాల్లోని చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు అవకాశం ఇస్తున్నాయి.
భారత్‌లో స్థిరంగా వృద్ధి చెందే ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్‌ఎంసీజీ) రంగంలోని కంపెనీలు చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ పరిశ్రమలో ప్రముఖ సంస్థలుగా ఉన్న హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్), డాబర్, గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్(జీసీపీ)..వంటివి ఈ పంథాను అనుసరిస్తున్నాయి. ఈమేరకు 2024 ఆర్థిక సంవత్సరంలో చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్ల మార్కెట్ విలువ రూ.2,344 కోట్లుగా ఉంది. ఇది 2026 నాటికి రూ.3,375 కోట్లకు చేరుతుందని అంచనా. కంపెనీలు తమ డిజిటల్ బడ్జెట్‌లో సుమారు 8-10 శాతం రెవెన్యూను ఈ ప్రచారానికి ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. దేశీయంగా ఎఫ్‌ఎంసీజీ రంగంలో పెద్ద కంపెనీగా ఉన్న హెచ్‌యూఎల్ తన ఉత్పత్తుల ప్రమోషన్ కోసం వెచ్చించే ఖర్చును 2024లో 31 శాతం పెంచి రూ.6,380 కోట్లకు చేర్చింది. ఈ కంపెనీ దాదాపు 700 మంది ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా దేశంలోని అన్ని భాషల్లో తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తోంది.
ఇదీ చదవండి: పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు!
ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు సామాజిక మాధ్యమాలు, యూట్యూజ్, ఇన్‌స్టాగ్రామ్..వంటి వాటిలో కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తారు. ఇదిలాఉండగా, ఏ వస్తువైనా మార్కెట్‌లోని ఇతర కంపెనీ ఉత్పత్తుల ధరతో పోల్చి ఎక్కడ తక్కువకు లభిస్తుందో బేరీజు వేసుకుని తీసుకోవాలి. ప్రధానంగా ఏదో విలాసాలకు వస్తువులు కొనకుండా అవసరానికి మాత్రమే కొనుగోలు చేసేలా జాగ్రత్తపడాలి. డబ్బు మిగిల్చుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment