ఫ్యామిలీ స్టార్‌పై నెగెటివ్‌ ప్రచారం.. విజయ్‌ ఫిర్యాదుపై క్లారిటీ! | Vijay Devarakonda Clarity On Complaint Over Family Star Movie | Sakshi
Sakshi News home page

Family Star Movie: పోలీసులకు విజయ్ దేవరకొండ ఫిర్యాదు.. క్లారిటీ ఇదే!

Published Thu, Apr 11 2024 1:33 PM | Last Updated on Thu, Apr 11 2024 2:03 PM

Vijay Devarakonda Clarity On Complaint Over Family Star Movie - Sakshi

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. పరశురామ్‌- విజయ్‌ కాంబోలో వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఫుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంపై నెగెటివీటి కూడా పెద్దఎత్తున వైరలైంది. కొందరు కావాలనే నెగెటివ్ ప్రచారం చేయడంతో ఏకంగా నిర్మాత దిల్‌ రాజు రంగంలోకి దిగాల్సి వచ్చింది. తానే స్వయంగా థియేటర్ల వద్దకు వెళ్లి ఆడియన్స్‌ను కలిసి రివ్యూలు తీసుకున్నారు.

మరోవైపు ఈ సినిమాపై నెగెటివ్‌ ప్రచారం‍ చేయడంపై సోషల్ మీడియా ఖాతాలపై విజయ్ టీమ్ పోలీసులను ఆశ్రయించింది. ఉద్దేశపూర్వకంగా ఫ్యామిలీ స్టార్‌ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ మాదాపూర్ సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ ఓ ఫోటో నెట్టింట వైరలవుతోంది. అయితే దీనిపై విజయ్‌ను ఆరా తీయగా.. అలాంటిదేం లేదని బదులిచ్చారు. ఆ ఫోటో కొవిడ్‌ టైంలో ఓ కార్యక్రమంలో తీసిందని విజయ్ దేవరకొండ తెలిపారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్‌ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement