అతని పెళ్లి కోసం కుటుంబంతో సహా వెళ్లిన విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda And His Family Attend The Wedding Of Personal Guard, Video Goes Viral - Sakshi
Sakshi News home page

అతని పెళ్లి కోసం కుటుంబంతో సహా వెళ్లిన విజయ్‌ దేవరకొండ

Published Tue, Apr 23 2024 3:09 PM | Last Updated on Tue, Apr 23 2024 5:01 PM

Vijay Devarakonda Attend His Personal Employee Wedding Function - Sakshi

ఫ్యామిలీ స్టార్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్‌ దేవరకొండకు ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పవచ్చు. ఫ్యాన్స్‌లో రౌడీబాయ్‌గా ముద్రవేసుకున్న ఆయనకు ఎనలేని అభిమానులు ఉన్నారు. విజయ్‌ తన చుట్టూ ఉండే తన సిబ్బందిని కూడా కుటుంబసభ్యులుగా భావిస్తారని తెలిసిందే. విజయ్‌ పబ్లిక్‌ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు తనకు రక్షణగా బాడీ గార్డ్స్‌ ఉంటారు. ఎప్పుడూ విజయ్‌ కోసం వెన్నంటి ఉండే  వారిలో ఒకరిది తాజాగా వివాహం జరిగింది. ఆ వేడుకలలో విజయ్‌ కూడా పాల్గొని సందడి చేశారు.

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా రవి అనే యువకుడి పెళ్లికి తన కుటుంబంతో సహా వెళ్లారు. గత కొన్నేళ్లుగా విజయ్‌ వద్ద ఆ యువకుడు వ్యక్తిగత బాడీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. దీంతో ఆ వివాహానికి  తన తల్లిదండ్రులతో సహా వెళ్లాడు. నూతన వధువరులను విజయ్‌ కుటుంబసభ్యులు ఆశీర్వదించారు. ఈ క్రమంలో రవి కుటుంబ సాంప్రదాయం ప్రకారం హీరో విజయ్‌కి కత్తి బహుకరించి పెద్దలు సన్మానం చేశారు. దీంతో విజయ్ కూడా ఆ కత్తి పట్టుకొని ఫోటోలు దిగారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఫ్యామిలీ స్టార్‌ చిత్రం తర్వాత గౌతమ్‌ తిన్ననూరితో విజయ్ దేవరకొండ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.VD12 పేరుతో ఇది ప్రచారంలో ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement