
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే హైదరాబాద్‌లో మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. ఈవెంట్‌కు భారీగా అభిమానులు హాజరయ్యారు. అయితే ఈవెంట్‌కు స్పెషల్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను బైక్‌పై ఎక్కించుకుని వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే బైక్‌పై ఉన్న విజయ్ ఓ బూతు పదాన్ని ఉపయోగించారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైక్‌పై వస్తున్న విజయ్‌కు ఎదురుగా ఎవరో అడ్డుగా ఉండడంతో బూతుపదాన్ని వాడారు. ఇది చూసిన నెటిజన్స్ పబ్లిక్ అలాంటి మాటలేంటి బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఫ్యామిలీ స్టార్ ఈనెల 5న థియేటర్లో సందడి చేయనుంది.
Public lo avem matalu bro @TheDeverakonda 🙏 pic.twitter.com/F0oHqv5TrK
— Rohit_45 (@2Gokul_1909) April 3, 2024
Comments
Please login to add a commentAdd a comment