విజయ్‌పై అక్కసుతోనే నెగెటివ్‌ ప్రచారం | Family Star: Cybercrime Police Complaint Filed Against Troll Gang Based On The Social Media Screenshots - Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ స్టార్‌ మూవీకి నెగెటివ్‌ రివ్యూలు.. సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు

Published Sun, Apr 7 2024 5:48 PM | Last Updated on Sun, Apr 7 2024 6:00 PM

Cyber Crime Complaint on Who Trolls Vijay Devarakonda Family Star Movie - Sakshi

కొందరు పనిగట్టుకుని ఫ్యామిలీ స్టార్ సినిమా మీద దుష్ప్రచారం చేస్తూ ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తున్నారన్నారు. దీని వల్ల సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం డైరెక్టర్‌ పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి. సినిమా రిలీజ్‌ అవడానికి ముందే ఫ్యామిలీ స్టార్‌పై నెగిటివ్ పోస్టులు చేశారు. ఇవన్నీ చిత్ర  నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దృష్టికి వచ్చింది.

సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు
నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి ఆదివారం నాడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు పనిగట్టుకుని ఫ్యామిలీ స్టార్ సినిమా మీద దుష్ప్రచారం చేస్తూ ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తున్నారన్నారు. దీని వల్ల సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ద్వేషంతోనే..
వీరి దగ్గర నుంచి కంప్లైంట్, ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్ విషయంలో కొందరు విజయ్ మీద ద్వేషంతో ఇలా ఆయన సినిమాల మీద నెగిటివ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తున్నారు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.

చదవండి:  తనకు భార్య, పిల్లలు ఉన్నారు.. అందరినీ ఎదిరించి నాతో పెళ్లి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement