Viral: Bengaluru Man Arrested For Sharing Abusive Posts On Puneeth Rajkumar Death - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: పునీత్‌ మరణంపై అసభ్యకర పోస్ట్‌, యువకుడి అరెస్ట్‌

Published Wed, Nov 3 2021 1:32 PM | Last Updated on Wed, Nov 3 2021 7:18 PM

Bengaluru Boy Arrested For Sharing Derogatory Posts Over Puneeth Rajkumar Death - Sakshi

Bengaluru Man Arrested For Offensive Comments On Puneeth rajkumar Death: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాల మరణం ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. అభిమానులు ఇంకా ఈ వార్తను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇక పునీత్‌ కుటుంబ సభ్యుల ఆవేదనను వర్ణించడానికి మాటలు చాలడం లేదు. శుక్రవారం(అక్టోబర్‌ 29) పునీత్‌ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియాలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అప్పుకు నివాళులు అర్పిస్తుంటే.. మరికొందరూ ఆకతాయిలు ఆయన మరణంపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు.

చదవండి: పునీత్‌ ఇంటి సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌, ఇవే అప్పు చివరి క్షణాలు!

మద్యం సీసాతో పునీత్‌ మరణాన్ని అపహస్యం చేస్తూ రిత్విక్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ వరుస పోస్టులు పెట్టాడు. అది గమనించిన బెంగళూరు సైబర్‌ క్రైం పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిపై బెంగళూరు నగర పోలీసు కమిషన్‌ కమల్‌ పంత్‌ స్పందిస్తూ.. ‘ఇప్పటికే ఓ యువకుడిని అరెస్టు చేశాం. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని ట్విటర్‌లో వెల్లడించారు. కాగా శుక్రవారం పునీత్‌ గుండెపోటుతో మృతి చెందిన అనంతరం కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించిన విషయం విధితమే. 

చదవండి: అందుకే సూర్యను అమ్మాయిలు ఇష్టపడతారు, అదే నా టెన్షన్‌: జ్యోతిక

అలాగే నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా బెంగళూరు పోలీసులు ఆదివారం వరకు మద్యం విక్రయాలను నిషేధించారు. దీనిపై నిందితుడు మద్యం సీసాను చేతిలో ప‌ట్టుకొని ‘రేపటి నుంచి మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మద్యం తాగి పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గర.. ’అంటూ అవమానకర రీతిలో పోస్ట్‌ పెట్టాడు. దీంతో పునీత్‌ ఫ్యాన్స్‌ సదరు నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement