సత్యాన్ని చంపేయబోతున్నారు : రవిప్రకాశ్‌ | Ravi Prakash Attends At Cyber Crime Police In Cyberabad | Sakshi
Sakshi News home page

సత్యాన్ని చంపేయబోతున్నారు : రవిప్రకాశ్‌

Published Wed, Jun 5 2019 11:53 AM | Last Updated on Wed, Jun 5 2019 1:07 PM

TV9 Ravi Prakash Attends At Cyber Crime Police In Cyberabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్‌ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ రెండోరోజు సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. బుధవారం మధ్యాహ్నం  ఆయన సైబరాబాద్‌ సైబర్‌ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. ఇదిలాఉండగా.. 27 రోజులుగా పరారీలో ఉన్న రవిప్రకాశ్‌ ఎట్టకేలకు మంగళవారం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, డేటా చౌర్యం కింద నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే పోలీసులు సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం రవిప్రకాశ్‌ను నిన్న ఐదు గంటల పాటు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్‌ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. 
(పోలీసుల ఎదుటకు రవిప్రకాశ్‌)

సైబర్‌క్రైం కార్యాలయం వద్ద రవిప్రకాశ్‌ మీడియాతో  మాట్లాడుతూ.. ‘ మీడియాకు మాఫియాకు తెలుగు నెలమీద యుద్ధం జరుగుతోంది. మీడియా వైపు మేమున్నాం. ప్రజలంతా మీడియా వైపు ఉండాలి. మాఫియాకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో మీడియా కబ్జాకాండ కొనసాగుతోంది. దొంగ పత్రాలు సృష్టించి, పొలీసులు, రెవెన్యూ అధికారులు పేద రైతుల్ని ఒత్తిడి చేసి ఏవిధంగా అయితే భూములు ఆక్రమిస్తారో అదే పద్దతిలో మీడియాను ఆక్రమిస్తున్నారు. నాకు కొంత మంది మిత్రులు ఉన్నారు. వారంతా కలసి మోజో టీవీని నెలకొల్పారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దానిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన అంబరీష్ పూరి వ్యవహరిస్తున్నారు. కొంతమంది పోలీసుల సహకారంతో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాకున్నారు. సత్యాన్ని చంపేయబోతున్నారు. ఈ లేకి తనాన్ని నిలదీయడానికి అందరూ పోరాడాలి. మీడియా కబ్జాపై జర్నలిస్టులందరూ పోరాడాలి. ప్రజలందరూ మీడియా  కబ్జాపై గళం ఎత్తాలని కోరుతున్నా’అని ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement