సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ మూడోరోజు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం 10 గంటలు సమయంలో ఆయన సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. 27 రోజుల పాటు పరారీలో ఉన్న ఆయన ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఆయనను 5 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. అయితే, రవిప్రకాశ్ పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా.. వారి ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఇక రెండోరోజు కూడా ఆయన తీరు మారలేదు. బుధవారం ఉదయం 11.30 గంటలు దాటిన తర్వాత సైబర్ క్రైం కార్యాలయానికి వచ్చిన రవిప్రకాశ్.. అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం విచారణ కోసం లోపలకు వెళ్లారు. అప్పటి నుంచి రాత్రి 10.30 గంటల వరకు 11 గంటలపాటు పోలీసులు ఆయన్ను విచారించారు.
(రెండోరోజూ అదే తీరు!)
ప్రధానంగా అలందా మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన రెండు కేసులపై పోలీసులు ప్రశ్నలు సంధించారు. టీవీ9 పాత యాజమాన్యం నుంచి అలందా మీడియాకు యాజమాన్య బదిలీలు జరగకుండా ఉండేందుకు నకిలీ పత్రాలు సృష్టించడం, కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంపై నమోదైన రెండు కేసులకు సంబంధించి పోలీసులు విచారించారు. అయితే, విచారణలో తమకు రవిప్రకాశ్ ఎంతమాత్రం సహకరించలేదని పోలీసు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment