
బుల్లితెర యాంకర్, బిగ్‌బాస్-5 కంటెస్టెంట్ రవి పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తనపై, తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొందరిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనపై ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోని రవి.. కుటుంబ సభ్యులపై కూడా ట్రోల్స్ రావడంతో భరించలేక పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తోంది.
కాగ, బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పాల్గొన్న రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. రవి బయటకు రావడం పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం కుటుంబంతో కలిసి హాలిడేకి వెళ్లిన రవి ఇటీవలే తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న టాప్ 5లో శ్రీరామ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment