తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా రౌడీ హీరోపై ఓ వ్యక్తి.. యూట్యూబ్ ఛానెల్ వేదికగా కొన్ని అసభ్యకర వార్తలు ప్రసారం చేశాడు. దీంతో ఆ వ్యక్తిని ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?)
ఇంతకీ ఏం జరిగింది?
అనంతపురంకు చెందిన వెంకట కిరణ్.. సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్‌లో విజయ్ దేవరకొండని అవమానిస్తూ ఫేక్ వార్తల్ని ప్రసారం చేశాడు. విజయ్ గౌరవాన్ని కించపరిచేలా, ఆయన సినిమాల్లోని హీరోయిన్లని అవమానించేలా ఈ వీడియోలు ఉన్నాయి. వీటిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి సదరు వ్యక్తి ఆచూకీని తెలుసుకున్నారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే అసత్య వార్తల్ని ప్రసారం చేసిన వెంకట్ కిరణ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలనీ, ఛానల్‌ని డిలీట్ చేయించారు. భవిష్యత్‌లో ఇలా మరోసారి చేయకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. టార్గెటెడ్‌గా ఎవరు ఇలాంటి కామెంట్స్ చేసినా, అవమానిస్తున్నట్లు న్యూస్ టెలికాస్ట్ చేసినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
(ఇదీ చదవండి: కీరవాణి ఇంటి కోడలిగా మురళీ మోహన్ మనవరాలు..)
Comments
Please login to add a commentAdd a comment