
నిందితుడు నరేష్
ప్రకాశం, కొండపి: మహిళను వాట్సప్ ద్వారా వేధిస్తున్న యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సింగరాయకొండ సీఐ యు.శ్రీనివాసరావు వివరాల మేరకు.. వలేటివారిపాలెం మండలం కలవల్ల గ్రామానికి చెందిన మోదేపల్లి నరేష్ కొంతకాలంగా ఫేస్‌బుక్ , వాట్సప్‌ల నుంచి మహిళల ఫొటోలు, ఫోన్ నంబర్లు పొంది తనది గోల్డ్‌షాప్ అని పరిచయం చేసుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. తనతో మాట్లాడకుంటే ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెడతానని బెదిరించేవాడు.
ఇటీవల కొండపి మండలంలోని కె.ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఓ మహిళను మానసిక క్షోభకు గురిచేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐఎంఈఐ నంబర్ల ద్వారా యువకుడిని కలవల్ల గ్రామం బస్ స్టాప్ వద్ద గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ ప్రసాద్, ఏఎస్‌ఐ సుబ్బయ్య, కానిస్టేబుళ్లను ఒంగోలు డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment