టీవీ 9, ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఆపేస్తాం | TV9, Andhra jyothi banned in Telangana | Sakshi
Sakshi News home page

టీవీ 9, ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఆపేస్తాం

Published Sun, Jun 15 2014 6:14 PM | Last Updated on Sat, Aug 18 2018 4:06 PM

టీవీ 9, ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఆపేస్తాం - Sakshi

టీవీ 9, ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఆపేస్తాం

హైదరాబాద్: తెలంగాణలో టీవీ-9, ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేస్తామని తెలంగాణ ఎంఎస్ఓల ప్రెసిడెంట్ సుభాష్ రెడ్డి చెప్పారు. ఆదివారం సాయంత్రం నుంచి ప్రసారాలను బంద్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. టీవీ-9 చానల్, ఆంధ్రజ్యోతి పత్రికపై తెలంగాణ సీఎం కేసీఆర్ శాసనసభలో నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. శాసనసభ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రసారాలు చేసిన టీవీ-9ను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నెగటివ్‌గా చూయించే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తోందని... పనిగట్టుకుని విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంఎస్ఓల ప్రెసిడెంట్ సుభాష్ రెడ్డి ప్రసారాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా టీవీ-9, ఆంధ్రజ్యోతిపై ఎలాంటి చర్య తీసుకోవాలన్న నిర్ణయాన్ని తెలంగాణ సభ్యులు.. అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్లకు అప్పగించారు. ఈ మేరకు సభ్యులు సభలో శనివారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అందుబాటులో ఉన్న చట్టాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు ఈ సందర్భంగా స్పీకర్, మండలి ఛైర్మన్లకు విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement