
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కవరేజ్‌కు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ప్రతినిధిపై రవిప్రకాశ్ అనుచరులు వాగ్వివాదానికి దిగారు. గేటు బయట నుంచే మీడియా వాళ్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ’సాక్షి’ రిపోర్టరుతో రవిప్రకాశ్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. కెమెరాను లాక్కునేకు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. టీవీ9 కార్యాలయం వద్ద మిగతా చానల్స్ ప్రతినిధులు ఉన్నప్పటికీ...కేవలం సాక్షి మీడియా ప్రతినిధినే వాళ్లు టార్గెట్ చేశారు. రోడ్డు అడ్డంగా ఉన్నారని, తమకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ దౌర్జన్యానికి దిగారు. లైవ్ కవరేజ్ చేస్తున్న డీఎస్‌ఎన్జీ వాహనం వైర్లు పీకేశారు.
Comments
Please login to add a commentAdd a comment