సాక్షి, హైదరాబాద్ : మెరుగైన సమాజం కోసం.. కులం గోడలు కూల్చేద్దాం..! అంటూ భారీ ఆదర్శాలను వల్లెవేస్తూ ఒక సాధాసీదా జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన రవిప్రకాశ్ టీవీ9 సీఈవో స్థాయికి ఎదిగాడు. ఇంటా బయటా ఎన్నో ‘రాజీకీయాలు’ చేశాడు. 8 శాతం వాటాతో 90.5 శాతం షేర్లు కలిగిన అలందా వాటాదారులను నియంత్రించాలని చూశాడు. చివరకు అవమానకర రీతిలో అటు సీఈవో పదవిని ఇటు డైరెక్టర్ పదవిని కోల్పోయాడు. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకున్నాడు. డెరెక్టర్లను నియమించుకోకుండా, యాజమాన్య బాధ్యతలు నిర్వర్తించకుండా అలందా సంస్థకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని శుక్రవారం సాయంత్రం జరిగిన ఏబీసీఎల్ బ్రాడ్ కాస్టింగ్ డెరెక్టర్లు వెల్లడించారు. సంస్థలో అధికారం చెలాయించే క్రమంలో రవిప్రకాశ్ తన గోతి తనే తవ్వుకున్నాడనే విమర్శలు వినవస్తున్నాయి.
(టీవీ9తో రవిప్రకాశ్‌కు సంబంధం లేదు: డైరెక్టర్లు)
‘50కి పైగా షేర్లున్న వాటాదారుకు యాజమాన్య హక్కులు దఖలు పడాలి. మేమూ అదే చేశాం. సంస్థలో అవకతవకలు చోటుచేసుకున్నాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే డైరెక్టర్ల సమావేశం నిర్వహించి మే 8న ఆయనను పదవి నుంచి తొలగించాం. కంపెనీల చట్టం ప్రకారం డైరెక్టర్ల మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాన్ని షేర్ హోల్డర్ల మీటింగ్‌లో చర్చించి శుక్రవారం మీడియాకు వెల్లడించాం. వాటార్లందరి అభిప్రాయం మేరకే వారిని తొలగించాం. కానీ, రవిప్రకాశ్ నిన్న టీవీ9 లైవ్‌లోకొచ్చి తనపై ఎలాంటి ఆరోపణలు లేవని అన్నాడు. ఆరోపణలు లేకుంటే మంచిదే’ అని డెరెక్టర్ సాంబశివరావు అన్నారు. ఇక ఆదిపత్యం చెలాయించే క్రమంలో రవిప్రకాశ్ ఫోర్జరీ సంతకాల కేసులో ఇరుకున్నట్టు తెలుస్తోంది. తన సంతకం ఫోర్జరీ చేశారని కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాలే స్వయంగా ఫిర్యాదు చేసినట్లు డైరెక్టర్లు చెప్పారు. టీవీ9 కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీఓఓగా గొట్టిపాటి సింగారావును నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment