సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఆస్తులపై విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. రవిప్రకాశ్ అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని ఫిర్యాదు చేశారు. ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఫెమ, మనీలాండరింగ్, ఐటీ నిబంధనల్ని రవిప్రకాశ్ ఉల్లంఘించారని ఆరోపించారు. మొయిన్ ఖురేషి, సానా సతీష్‌తో కలిసి పలువురిని మోసం చేశారని లేఖలో పేర్కొన్నారు.
నకిలీ డాక్యుమెంట్లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించారని తెలిపారు. హవాలా సొమ్ముతో కెన్యా, ఉగాండాలోని కంపాల సిటీకేబుల్‌లో రవిప్రకాశ్ పెట్టుబడులు పెట్టారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రవిప్రకాశ్ అక్రమ వ్యాపారాలు, పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను జతచేసి ఆధారాలతో సహా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు విజయసాయిరెడ్డి లేఖ రాసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment