ఎల్లో మీడియా మళ్లీ విషం గక్కింది. అదిగో తోక అంటే.. ఇదిగో మేక అన్న చందాన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం ఇచ్చిన రెండు ట్వీట్లను పట్టుకుని ఎల్లో చానెళ్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9, ఈటీవీ రసవత్తరమైన కథను అల్లి పారేశాయి. అసలు ఈడీ ఏం చెప్పిందో.. ఎవరెవరినుద్దేశించి చెప్పిందో కూడా పట్టించుకోకుండా తమకు అలవాటైన తప్పుడు కథనాల్ని నిస్సంకోచంగా ప్రసారం చేసేశాయి.