ETV
-
Prabhakar: ట్రోలర్స్ కి దొరికితే ఏసుకుంటారు..
-
ఎల్లో మీడియాపై పరువు నష్టం దావా..
-
ఈనాడు, ఈ టీవీ, మహా న్యూస్ కు 100 కోట్ల పరువు నష్టం దావా
-
పెదపారుపూడి టు ఫిలింసిటీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామోజీరావు.. పరస్పరం భిన్నమైన రంగాల్లో వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధించారు. యాడ్ ఏజెన్సీలో పనిచేయడం మొదలుపెట్టి.. ఎరువుల వ్యాపారం, చిట్‌ఫండ్స్, పచ్చళ్లు, మీడియా వంటి ఎన్నో రంగాలకు విస్తరించారు. రామోజీరావు ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16న జని్మంచారు. ఆయన తండ్రి వెంకట సుబ్బారావు రైతు. తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. పెదపారుపూడి, గుడివాడలలో పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ (బీఎస్సీ) గుడివాడలోనే పూర్తి చేశారు. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండో కుమార్తె రమాదేవితో రామోజీరావుకు వివాహం జరిగింది. మొదట యాడ్ ఏజెన్సీలో చేరి..: బీఎస్సీ పూర్తిచేసిన రామోజీరావు.. తన కుటుంబం చేసే వ్యవసాయానికే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అడ్వర్టైజింగ్ రంగం వైపు ఆసక్తి కలగడంతో.. ఢిల్లీ వెళ్లి ఓ అడ్వరై్టజింగ్ ఏజెన్సీలో చేరారు. అక్కడ మూడేళ్లు పనిచేశాక హైదరాబాద్‌కు వచ్చారు. 1962 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థను, 1965లో కిరణ్ యాడ్స్ పేరిట అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. తర్వాత ఇతర వ్యాపారాలవైపు దృష్టి సారించారు. 1967–1969 మధ్య వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారం చేశారు. ఆ సమయంలోనే వ్యవసాయ సమాచారంతో కూడిన అన్నదాత పత్రికను ప్రారంభించారు.1970లో ఇమేజెస్ ఔట్‌డోర్ యాడ్ ఏజెన్సీని, విశాఖలో డాలి్ఫన్ హోటల్‌ను ప్రారంభించారు. అప్పటికే పత్రికారంగంపై ఆసక్తి ఉన్న ఆయన.. విశాఖపట్నం కేంద్రంగా ఈనాడు పత్రికకు శ్రీకారం చుట్టారు. స్థానిక వార్తలకు ప్రాధాన్యమివ్వటం, గ్రామాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం, వేగంగా పంపిణీ చేయడం ద్వారా పత్రికను పాఠకులకు చేరువ చేశారు. ఎల్రక్టానిక్ మీడియాతోనూ..: పాత్రికేయ రంగంలో మార్పులను ముందుగానే గుర్తించిన రామోజీరావు.. మొదట్లో వినోదం ప్రధానాంశంగా ఈటీవీ చానల్‌ను ప్రారంభించారు. తర్వాత పూర్తి న్యూస్ చానల్ ఈటీవీ2ను ప్రారంభించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీ, తెలంగాణలకు విడివిడి న్యూస్ చానళ్లను ఏర్పాటు చేశారు. ఇక ‘ప్రియ’పేరిట రామోజీ ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారం కూడా సక్సెస్ అయింది. వివిధ రంగాల్లో రామోజీ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. రామయ్య నుంచి రామోజీగా మార్చుకుని..: రామోజీరావు తాత పేరు రామయ్య. ఆయన వ్యవసాయం చేసేవారు. రామోజీ జని్మంచడానికి కొన్నిరోజుల ముందు రామయ్య మరణించారు. దీంతో తాత పేరే మనవడికి పెట్టారు. కానీ రామయ్య అనే పేరు పాతదిగా అనిపించడంతో.. ఆయన తన పేరును రామోజీగా మార్చుకున్నారని చెబుతారు. తెల్ల వ్రస్తాలంటే మక్కువ..: రామోజీరావు ఎప్పుడు చూసినా తెలుపు రంగు వస్త్రధారణతోనే కనిపిస్తారు. ఆయనకు తెలుపు రంగు వ్రస్తాలంటే ప్రత్యేక మక్కువే దీనికి కారణమని చెబుతారు. వదులుగా ఉండే తెలుపు రంగు హాఫ్‌హ్యాండ్స్ షర్టు, అదే రంగు ప్యాంటు, మ్యాచింగ్‌గా తెలుపు రంగు షూస్ ధరించేవారు. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎప్పుడూ తెలుపు వస్త్రధారణతో ఉండేవారు.పత్రికారంగానికి ఎనలేని సేవలందించారురామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందివైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ‘తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో శనివారం పోస్టు చేశారు. -
రామోజీ కన్నుమూత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ వ్యాపారవేత్త, రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీని కుటుంబ సభ్యులు నానక్‌రాంగూడలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. గుండె పనితీరు దెబ్బతిన్నదని, బీపీ పడిపోయిందని గుర్తించిన వైద్యులు.. ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. యాంజియోగ్రామ్ చేసి గుండె నాళాల్లో స్టంట్ వేశారు. అయినా ఆయన కోలుకోలేదు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం మరింతగా క్షీణించి.. శనివారం తెల్లవారుజామున 4.51గంట లకు తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఉదయం 7.45 గంటలకు రామోజీ ఫిలింసిటీకి తెచ్చారు. రామోజీ మరణ వార్త తెలిసి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఫిలింసిటీలో రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఫిలింసిటీలోని నాగన్‌పల్లి–అనాజ్‌పూర్ గ్రామాల మధ్యలో ప్రత్యేకంగా నిర్మించిన స్మృతివనంలో రామోజీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఫోన్లో మాట్లాడి ఈ మేరకు సూచనలు చేశారు. దీంతో ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, రాచకొండ పోలీస్ కమిషనర్లను సీఎస్ ఆదేశించారు. బతికుండగానే రామోజీ స్మృతివనం ఇబ్రహీంపట్నం రూరల్: రామోజీరావు తాను బతికి ఉండగానే ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి–అనాజ్‌పూర్ మధ్యలో ప్రత్యేక స్మృతి వనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆయన అంత్యక్రియలను ఈ స్మృతివనంలోనే నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి శనివారం స్మృతి వనాన్ని పరిశీలించి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు చేయించారు. -
రామోజీ.. ఈ కథనం నువ్వు వేసిందేగా!
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని వక్రీకరించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న రామోజీరావు 7 నెలల క్రితం దాన్ని జగన్ ప్రభుత్వం అమల్లోకి తేలేకపోతుందంటూ ఈటీవీ భారత్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు. గతేడాది ఆగస్టు 11న ఈటీవీ భారత్‌లో ‘వైసీపీ ప్రభుత్వ ప్రచారాలకే పరిమితమైన చట్టాలు.. ఖాతాలో మరో యాక్ట్’ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులకు కూడా కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకోలేకపోతున్నారని అందులో వివరించారు. అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను ఆమోదించినా కేంద్రం నుంచి అనుమతి తేలేకపోతున్నారని ఆక్షేపించింది.అనేకసార్లు దిల్లీలో ప్రదక్షిణలు చేసిన సీఎం జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్‌కు కేంద్రం నుంచి ఆమోదం పొందడంలో విఫలమయ్యారని ఆ కథనంలో రామోజీ గుండెలు బాదుకున్నారు. ఆ కథనం వచ్చిన కొద్దినెలలకే కేంద్రం ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదముద్రా పడింది. ఇప్పుడు ఏకంగా విష ప్రచారం చేయడం రామోజీ ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. ఎంతో విజన్ ఉన్న చట్టం అని చెప్పిన దాని గురించి ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ఈ చట్టం వస్తే భూ యజమానులకు వరంగా మారుతుందని చెప్పిన ఈటీవీ ఇప్పుడు అది వస్తే భూములు పోతాయని రైతులను భయభ్రాంతులకు గురిచేసే కథనాలు వండి వారుస్తోంది. ఈ చట్టం గురించి వ్యతిరేక ప్రచారం చేసి భూములకు సంబంధించి వారిలో భయాలు సృష్టించి తద్వారా ఎన్నికల్లో చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు రామోజీ ఈ దిగజారుడు పాత్రికేయానికి తెగబడ్డారు. భూ హక్కుల చట్టంతో భూములకు భద్రత వస్తుందని ఈటీవీలో పలు కథనాలు ప్రసారం చేసి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్లు బురద జల్లడం ద్వారా తనకు కుట్రలు, కుతంత్రాలు తప్ప విలువలు, నీతి అనేదే లేదని రామోజీ నిరూపించుకున్నారు. -
మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు
సాక్షి, అమరావతి: ఒకరు నారా... మరొకరు రారా (రామోజీరావు)! ఒకరికి 75... మరొకరికి 87. ఇద్దరికీ ఏళ్లు వచ్చినా బుద్ధి మాత్రం రాలేదు! ముందొక మాట చెప్పి.. ఆ వెంటనే నాలుక మడత పెట్టడంలో ఇద్దరూ ఆరితేరిపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా... మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కొత్త వాగ్దానాలు, రంగురంగుల మేనిఫెస్టోతో తయారైపోవటం చంద్రబాబు సహజ లక్షణం. 2014లో వందల హామీలిచ్చేసిన బాబు... ఎన్నికల్లో గెలిచిన వెంటనే వాటిని నెరవేర్చటం తన తరం కాదని తెలిసి ఏకంగా మేనిఫెస్టోనే కనపడకుండా చేసేశారు. ఆఖరికి తన పార్టీ వెబ్సైట్లో నుంచి కూడా తీసేశారు. రామోజీరావూ సేమ్ టూ సేమ్! కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రామోజీ గతంలో బాగా ప్రశంసించారు. దీన్లో ఉన్న అంశాలను వివరిస్తూ... ఈ చట్టంతో రైతుల భూమికి భద్రత ఉంటుందని, ఎక్కడైనా ఇబ్బందులొస్తే ప్రభుత్వమే వారికి పరిహారమిచ్చేలా గ్యారంటీ ఇస్తుంది కనుక ఇది చాలా మంచి చట్టమంటూ తన ఈటీవీ ‘అన్నదాత’ కార్యక్రమంలో ఓ స్టోరీని ప్రసారం చేశారు. ఇపుడు ఎన్నికల వేళ సీఎం జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక... ఇంకా అమల్లోకే రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టం వచ్చేసిందంటూ, ప్రభుత్వం అందరి భూములూ లాక్కుంటోందంటూ టీడీపీ విష ప్రచారం మొదలెట్టింది. టీడీపీ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన ‘ఈనాడు’ శక్తి మేరకు విషం చిమ్ముతోంది. ఈ చట్టం వస్తే ‘మీ భూములు మీవి కావు’ అంటూ విషపూరిత కథనాలు ప్రచురిస్తోంది. ఇక చంద్రబాబు, లోకేశ్ అయితే ‘మీ భూములు జగన్ ప్రభుత్వం లాక్కుంటుంది జాగ్రత్త..!’ అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఈటీవీ’ గతంలో ప్రసారం చేసిన కథనాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం బయటపెట్టారు. వీడియో లింక్‌ను అందరికీ షేర్ చేశారు. దీంతో తన బండారం బయటపడి పోయిందని గ్రహించిన రామోజీరావు.. క్షణాల్లో ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయించారు. ఇపుడు ఆ లింకుపై క్లిక్ చేసిన వారికి... ‘దిసీజ్ ప్రైవేట్ వీడియో’ అనే మెసేజ్ కనిపిస్తోంది. ఇది చూసినవారు బాబు, రామోజీ ఇద్దరూ ఇద్దరే అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీని పబ్లిక్‌గా ప్రసారం చేస్తున్నపుడు దాన్లోని వీడియోలు ప్రైవేట్‌వి ఎలా అవుతాయి? ఈ ప్రశ్నకు రామోజీ దగ్గర సమాధానం లేదు. గుడ్డలిప్పిన గురుశిష్యులు! కొద్దిరోజులుగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి అడ్డూ అదుపూ లేకుండా విషం చిమ్ముతున్న ఎల్లో మీడియా, చంద్రబాబు పరివారం బట్టలు విప్పుకుని బరి తెగించి చెబుతున్న మాయమాటలు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పన్నిన మాయోపాయాలేనని తేలిపోయింది. భూ హక్కు చట్టంపై చెబుతున్న బూటకపు కబుర్లన్నీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కారు కూతలేనని బయటపడింది. ఈ చట్టం చాలా మంచిదని, రాష్ట్రంలోని రైతులకు ఎంతో మేలు చేస్తుందంటూ స్వయంగా రామోజీ మీడియానే గతంలో అనేక కథనాలు అచ్చేసింది. ఈటీవీలోనూ పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయగా, చట్టం అద్భుతమని కితాబిస్తూ ఈనాడులోనూ కథనాలు రాశారు. రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఈటీవీ అన్నదాతలో నాలుగు నెలల క్రితం ‘టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి భద్రత’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం గమనార్హం. ప్రముఖ భూ చట్టాల నిపుణుడు, హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎం.సునీల్‌కుమార్ ఈ చట్టం వస్తే రాష్ట్రంలోని భూముల వ్యవస్థ ఎంతగా మారిపోతుందో చాలా కూలంకషంగా వివరించారు. చంద్రబాబు కోసం హఠాత్తుగా యూటర్న్ రామోజీ గతంలో తాను ఈ చట్టానికి అనుకూలంగా ప్రసారం చేసిన వీడియోకి విరుద్ధంగా ఎన్నికల్లో చంద్రబాబు లబ్ధి కోసం తాజాగా యూటర్న్ తీసుకున్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి వ్యతిరేకంగా బురద జల్లే బాధ్యత తనపై వేసుకున్నారు. ఈ చట్టం ద్వారా రైతుల భూములకు భద్రత ఉంటుందని చెప్పిన నోటితోనే అది దుర్మార్గమంటూ నిస్సిగ్గుగా నాలుక మడతేశారు. రైతుల భూములు తెల్లారేసరికల్లా ఇతరుల పేరు మీదకు మారిపోతాయని, సీఎం జగన్ ప్రజల స్థిరాస్తులు లాక్కునేందుకే ఈ చట్టం తెచ్చారంటూ బరితెగించి దుష్ప్రచారానికి తెగబడ్డారు. ఈ అడ్డగోలు ప్రచారంతో ప్రజల మెదళ్లను విషపూరితం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ల్యాండ్ టైట్లింగ్ చట్టం చాలా మంచిదంటూ ఈటీవీ ప్రసారం చేసిన వీడియో తాజాగా వైరల్ కావడంతో పచ్చ మంద నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. అందులో ఈ చట్టాన్ని సమర్థిస్తూ ఇది రాష్ట్రానికి అవసరమని, ఎంతో ప్రయోజనకరమని చెప్పిన అంశాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. భూ హక్కుల చట్టం గురించి అంత గొప్పగా చెప్పి అది వస్తే భూములకు భరోసా వస్తుందని కితాబిచ్చిన రామోజీ ఇప్పుడు సిగ్గు విడిచి భూములు పోతాయని కల్లబొల్లి మాటలు చెప్పడం ఏమిటని అంతా విస్తుపోతున్నారు. చంద్రబాబు హయాంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి వదిలేసిన భూదార్ ప్రాజెక్టుకు ఈ చట్టం కొనసాగింపు అంటూ అదే కథనంలో ఈటీవీ కార్యక్రమంలో ప్రసారం చేశారు. అది అబద్ధమే అయినా సీఎం జగన్ హయాంలో వచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి చెప్పే క్రమంలో చంద్రబాబు చేయలేక వదిలేసిన భూదార్ గురించి ప్రస్తావించారు. ఈ ప్రత్యేక కథనంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పదనం, దాని ఆవశ్యకత, రైతులకు చేకూరే ప్రయోజనాలు, భూముల వ్యవస్థలో వచ్చే మార్పుల గురించి సోదాహరణంగా వివరించారు. ఎంతో మంచి చట్టమని కితాబిచ్చిన రామోజీ ఎన్నికల వేళ ఈ స్థాయికి దిగజారడంపై ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. దీనిబట్టి ఈనాడు, ఈటీవీ కార్యక్రమాలన్నీ ప్రజలను మభ్యపుచ్చడం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మరోసారి స్పష్టమైందని పేర్కొంటున్నారు. ఆదరాబాదరాగా అదృశ్యం.. ఈ వీడియోతో తమ పరువు బజారున పడిందని గ్రహించడంతో నాలుక కరుచుకున్న రామోజీ ఆదరబాదరగా యూట్యూబ్‌లోని ఈటీవీ ఛానల్లో దాన్ని ఎవరూ చూడకుండా చేశారు. 2014 ఎన్నికల్లోనూ ప్రజలను మాయ చేసేందుకు చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి మేనిఫెస్టో విడుదల చేశాడు. అనంతరం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతుండడంతో వాటి గురించి ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో టీడీపీ వెబ్సైట్ నుంచి తొలగించి తన దొంగ బుద్ధిని చాటుకున్నారు. ఇప్పుడు రామోజీ కూడా ఎంతో మంచిదని తాను ప్రసారం చేసిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం వీడియోను ఈటీవీ యూట్యూబ్ ఛానల్లో కనపడకుండా మాయం చేశారు. తద్వారా రామోజీ, చంద్రబాబు ప్రజా ప్రయోజనాలు పట్టని గురు శిష్యులని మరోసారి స్పష్టంగా రుజువైంది. కాగా 2019లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం బిల్లుకు అసెంబ్లీలో టీడీపీ మద్దతివ్వడం గమనార్హం. ఈ చట్టంతో భూ కబ్జాలకు తెర పడుతుందన్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ పూర్తిగా సమర్థిస్తోందంటూ బిల్లుకు మద్దతు పలికారు. ఇప్పుడు ఎన్నికల ప్రయోజనాల కోసం ‘యూటర్న్’ తీసుకుని మీ భూములు లాక్కుంటారంటూ ప్రతి సభలోనూ చంద్రబాబు పెడబొబ్బలు పెడుతుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అసలు అమల్లోకి రాని చట్టంపై ఇంత దుష్ప్రచారమెందుకని నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఈటీవీలో ఏం చెప్పారంటే.. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. మీకు భూమి ఉంటే అది పట్టాదార్ పాస్ పుస్తకంలోగానీ ఆన్లైన్ రికార్డులోగానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో భూములున్నా సరైన పాస్ పుస్తకాలు, ఇతర హక్కు పత్రాలు లేక రికార్డుల్లో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నారు. కొత్త చట్టాన్ని అనుసరించి భూ యజమానులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిష్టర్‌లో ఎవరి పేరు ఉంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది. -
నాపై ఈటీవీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసింది: కొమ్మినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై పరిశీలన కోసం ఏపీ ప్రెస్ ఆకాడమీ ఛైర్మన్‌గా తాను వెళితే అబద్దాలు సృష్టించి వార్తలు అల్లిందని ఈనాడు గ్రూపుపై మండిపడ్డారు కొమ్మినేని శ్రీనివాసరావు. కందుకూరులో తొక్కిసలాటకు చంద్రబాబు వైఖరి కారణమని ప్రపంచమంతా చెబుతున్నా.. అసలు వాస్తవాన్ని వక్రీకరిస్తూ.. ఈనాడు సంపాదకీయంలో పోలీసుల వైఫల్యం వల్ల తొక్కిసలాట జరిగిందని రాశారని, దాని నిజనిజాలు తేల్చేందుకు కందుకూరు ఘటనాస్థలిని పరిశీలించానని కొమ్మినేని తెలిపారు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించగా... కొందరు ఈనాడు విలేకరులు ప్రశ్నలు వేశారని, దానిని వక్రీకరించి కొమ్మినేనికి కాక అంటూ ఓ అబద్దాన్ని, అసత్యాన్ని సృష్టించి ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారని తెలిపారు ప్రెస్ ఆకాడమీ ఛైర్మన్ కొమ్మినేని. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి పార్టీ ఫిరాయించేలా చేస్తే.. దాన్ని సమర్థించిన ఈనాడుకు నేడు ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధంగా కనిపించిందా? అని ప్రశ్నించారు. నిజంగా ఈనాడు, ఈటీవీకి జర్నలిజం దమ్ముంటే.. రాసిన వార్తకు కట్టుబడి ఉంటే.. తన ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం వీడియో ప్రసారం చేయాలని కొమ్మినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దీని ద్వారా ప్రజలందరికీ నిజనిజాలు తెలుస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఈనాడు తీరు చూస్తుంటే.. విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్టే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ విలేకరులకు అవగాహన తరగతులు అనంతరం కావలికి వచ్చిన కొమ్మినేని.. ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయ మిత్రులతో సమావేశమయ్యారు. ఈ జర్నలిజంలో మౌలిక సూత్రాలు, విలువలు గురించి గ్రామీణ విలేకరులకు ప్రతి జిల్లాలో అవగాహన తరగతులు నిర్వహిస్తామన్నారు. వివిధ మాధ్యమాలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మీడియాలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవగాహన తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అదే విధంగా యూనివర్సిటీలలో జర్నలిజం డిప్లొమా కోర్సులలో ప్రస్తుతం ఉన్న సిలబస్‌ను కుదించి, ఆచరణాత్మకంగా ఉండేట్లుగా కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలని, వాస్తవ అవాస్తవాలను పరిశీలించిన మీదటే వార్తలు రాయాలన్నారు. జర్నలిజం పేరుతో వ్యక్తిగత విధ్వంసకర దాడి సరికాదన్నారు. విలువల గురించి ప్రచారం చేయాలన్నారు. చదవండి: ఎందుకీ వెకిలి రాతలు.. ‘ఈనాడు’ ఎవరి కోసం పనిచేస్తోంది? కొమ్మినేని శ్రీనివాసరావును సత్కరించిన పాత్రికేయులు సమావేశం తర్వాత ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును పాత్రికేయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కె శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి, వెంకట్రావు, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వర ప్రసాద్, పాత్రికేయులు పాల్గొన్నారు. -
‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం?
‘పేదలందరికీ ఇళ్ల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది’..ఈ వ్యాఖ్యలు.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరదీప్‌సింగ్ పూరి ఎప్పుడో కాదు.. తాజాగా ఆదివారం చేసినవి. పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే ఇలా కితాబిస్తుంటే.. చంద్రబాబుకు అడ్డగోలుగా కొమ్ముకాసే ఈనాడు, ఈటీవీ మాత్రం పథకం నత్తనడకన నడుస్తోంది, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఎప్పటిలాగే దుష్ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర పథకాలకు జాతీయ స్థాయిలో ఎక్కడాలేని గుర్తింపు, ప్రశంసలు లభిస్తుంటే పచ్చమీడియా మాత్రం ప్రజలపై పచ్చివిషం కక్కుతోంది. ‘పునాదే దాటని పేదిల్లు’.. అంటూ సోమవారం ఆ విషపత్రిక ఓ కథనం వండి వార్చింది. ఈ కథనంలో పలు అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అక్కసు, కడుపుమంటను అక్షరం అక్షరంలో ప్రదర్శించింది. ఆ కథనంలో ప్రస్తావించిన అంశాలు.. వాటి వెనకున్న ఈనాడు చెప్పని అసలు వాస్తవాలపై ‘ఏది నిజం’ చదవండి.. సాక్షి, అమరావతి: ఈనాడు : పథకం నత్తనడకన సాగుతోంది.. నిజం : తొలిదశ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి ఏడాదిన్నర కావస్తోంది. ఈ ఏడాదిన్నరలో గత ఏడాది మార్చి నుంచి జూన్ మధ్య కరోనా రెండో దశ వ్యాప్తితో పనులకు ఆటంకం ఏర్పడింది. కరోనా వ్యాప్తి నెమ్మదించి పనులు సజావుగా సాగుతున్న సమయంలో టీడీపీ నాయకులు కుట్రపూరితంగా కోర్టులకు వెళ్లి పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తిరిగి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య పథకం పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ఒమిక్రాన్ రూపంలో మరోమారు కరోనా వ్యాపించింది. ఈ కారణాలతో ఏడాదిన్నరలో అధిక కాలం ఇళ్ల నిర్మాణాలు సజావుగా సాగలేదు. ఇక ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల నుంచి పనులు చకచకా సాగుతున్నాయి. దీంతో ఒక్క మే నెలలోనే 30 వేల ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రోజుకు రూ.25 కోట్ల మేర పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 60,783 ఇళ్లు పూర్తయ్యాయి. ఈనాడు: లేఅవుట్లలో విద్యుత్, నీటి సరఫరా లేదు. సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.. నిజం: 17వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పథకం కింద 30.60 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా లేఅవుట్లలో తాత్కాలిక సదుపాయాల కల్పనకు రూ.1,200 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా లేఅవుట్లలో విద్యుత్ సరఫరా, బోర్లు వేయడం, మోటార్లు బిగించడం చేపడుతున్నారు. ఇప్పటికే రూ.450 కోట్లు ఖర్చుచేసి తొలిదశ నిర్మాణాలు చేపడుతున్న లేఅవుట్లలో తాత్కాలిక సదుపాయాల కల్పన చేపట్టారు. రూ.32వేల కోట్లతో కాలనీల్లో శాశ్వత సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. ఇందులో భాగంగా విద్యుత్ సదుపాయాల కల్పనకు రూ.4,260 కోట్లు కేటాయించారు. విద్యుత్ సదుపాయాల కల్పనకు ఇప్పటికే టెండర్లు పూర్తయి, పనులు కూడా ప్రారంభించారు. ఈనాడు : కేంద్ర సాయానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు.. నిజం: కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షల చొప్పున సాయం చేస్తోంది. ఇందుకు అదనంగా రూ.30 వేలను రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తోంది. ఇది కాకుండా.. పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షల రిజిస్ట్రేషన్ విలువ గల ప్లాట్లను 30.60 లక్షల మంది పేదలకు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ మొత్తం ప్లాట్ల మార్కెట్ విలువను పరిశీలిస్తే.. రూ.56,102 కోట్ల మేర ఉంటుందని అంచనా. ప్లాట్లు పంపిణీ చేసిన లేఅవుట్లు మెజారిటీ శాతం ఊళ్లకు దగ్గరగా, ప్రైమ్ ఏరియాల్లోనే ఉన్నాయి. ఉదా.. బాపట్ల జిల్లా కేంద్రంలోని ప్యాడిసన్‌పేటలో కత్తిపూడి–ఒంగోలు నేషనల్ హైవే 216కు పక్కనే లేఅవుట్లో ప్లాట్ మార్కెట్ ధర రూ.10 లక్షలు పలుకుతోంది. అలాగే, తిరుపతి–శ్రీకాళహస్తి జాతీయ రహదారి పక్కన 5,896 మందికి 220 ఎకరాల్లో ప్లాట్లు పంపిణీ చేశారు. ఇందులో నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా 30 బోర్లు వేసి వాటికి విద్యుత్ మోటార్లను బిగించి, ప్లాట్లకు పైప్లైన్లు వేశారు. దీంతో నేటి వరకూ చిల్లిగవ్వ ఆస్తిలేని పేదలకు ఒక్కసారిగా రూ.10లక్షలకు పైగా ఆస్తి సమకూరుతోంది. ఇక ఊళ్లకు దగ్గరగా భూములు లభించని చోట మాత్రమే విధిలేని పరిస్థితుల్లో కొంతదూరంగా ప్రభుత్వం లేఅవుట్లను ఏర్పాటుచేసింది. ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు 3 శాతం వడ్డీకి రూ.35వేలు బ్యాంకు రుణసాయం చేస్తోంది. రుణాలు పొందేందుకు వీలుగా సిబిల్ స్కోర్ నుంచి పేదలకు మినహాయింపు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటివరకూ 3,70,826 మంది పేదలకు రూ.1,370.39 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం అందించింది. రూ.15వేలు విలువ చేసే 20 టన్నుల ఇసుకను లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తోంది. అదే విధంగా సబ్సిడీపై ఇనుము, సిమెంట్, ఇతర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. తద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.40వేల మేర లబ్ధి చేకూరుతోంది. మొత్తంగా 12 రకాల వస్తువులను సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సుమారు 2000 మంది లబ్ధిదారులకు నిర్మిస్తున్న లే అవుట్ ఈనాడు : ధరల పెరుగుదలతో పేదలపై భారం.. నిజం: గత కొద్దినెలలుగా నిర్మాణ సామాగ్రి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రభావం పేదలపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 20 టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు, బస్తా సిమెంట్ రూ.225 చొప్పున ఇటీవల వరకూ ప్రభుత్వం సరఫరా చేసింది. ఇటీవల కాలంలో సిమెంట్ ధరలు మళ్లీ విపరీతంగా పెరగడంతో బస్తా సిమెంట్‌ను రూ.260కు అందిస్తున్నారు. ఇనుమును కంపెనీని బట్టి కిలో రూ.53, రూ.63, రూ.72లతో సరఫరా చేస్తున్నారు. మా ర్కెట్ ధరలతో పోలిస్తే కిలోకు రూ.20 తక్కువ. ఈనాడు: ఆప్షన్–3 లబ్ధిదారుల కుదింపు.. నిజం: ప్రారంభంలో ఆప్షన్–3 ఎంచుకున్న లబ్ధిదారులు చాలావరకూ స్వచ్ఛందంగా విరమించుకున్నారు. చివరకు 3.27 లక్షల మంది మాత్రమే ఆప్షన్–3కి కట్టుబడి ఉన్నారు. దీంతో వీరి ఇళ్ల నిర్మాణ బాధ్యతను గృహ నిర్మాణ శాఖ చేపట్టింది. లబ్ధిదారులను గ్రూపులుగా ఏర్పాటుచేసి కాంట్రాక్టర్లను అనుసంధానించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. ఈనాడు చెప్పినవి అసత్యాలు డబ్బుల్లేక ఇంటి నిర్మాణం ఆగిపోయిందని ఈనాడులో వచ్చిన కథనం అసత్యాల పుట్ట. నాకు ప్రభుత్వం నుంచి రుణం మొదటి వాయిదా పడింది. ఇప్పటివరకు నాకు రూ.70వేలు మంజూరైంది. 10 టన్నుల ఇసుక అందించారు. 343 కేజీల ఇనుము, 40 బస్తాల సిమెంట్ సబ్సిడీపై ఇచ్చారు. అంతేకాక.. స్త్రీ నిధి నుంచి రూ.50 వేల రుణం మంజూరైంది. జగనన్న సాయంవల్లే నేను ఇల్లు కట్టుకుంటున్నాను. ఈ విషయాలే ఈనాడు వారికి చెప్పాను. అయితే, వారు ఎలా రాసుకున్నారో నాకు తెలీదు. – జుత్తిగ పద్మావతి, పాలకోడేరు, పశ్చిమ గోదావరి జిల్లా లబ్ధిదారు జుత్తిగ పద్మావతితో మాట్లాడుతున్న భీమవరం ఆర్డీఓ దాసిరాజు (ఇక జుత్తిగ పద్మావతి విషయాలనే భీమవరం ఆర్డీఓ దాసిరాజు కూడా చెప్పారు. ఈనాడులో వచ్చిన వార్తలు నిజం కావని ఆయన స్పష్టంచేశారు. భీమవరం ఆర్డీఓ దాసిరాజు ఆమెను కలిసి వివరాలు సేకరించారు.) ఇమాములు ఇంటికి రూ.70వేల మేర సాయం ఈనాడులో పేర్కొన్న కర్నూల్ జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన ఇమాములు భార్య కవిత పేరిట ఇల్లు మంజూరైంది. వీరికి ఇప్పటివరకూ 10 టన్నుల ఇసుక ఉచితంగా, 25 బస్తాల సిమెంట్ సబ్సిడీపై సరఫరా చేశారు. దీనితో పాటు ఇంటి నిర్మాణ బిల్లు రూ.64,200 మంజూరు చేశారు. ఇలా మొత్తంగా రూ.70,875 మేర ఇమాములుకు లబ్ధి చేకూరింది. సబ్సిడీతో తగ్గిన భారం ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణాలకు కావాల్సిన సిమెంట్, ఐరన్‌ను సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. దీంతో మాపై చాలా భారం తగ్గుతోంది. ఇప్పటికే ఇంటి నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయింది. మరికొన్ని రోజుల్లో నా సొంతింటి కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. – జె. రేణుక, కడప, వైఎస్సార్ జిల్లా పదేళ్లుగా మాకు ఇల్లు లేదు గతంలో మాకు ఎవ్వరూ ఇల్లు మంజూరు చేయలేదు. జగనన్న సీఎం అయ్యాక మా కల నెరవేరింది. గత ఏడాది ఇంటి కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోగానే స్థలం ఇచ్చారు. అలాగే.. ఇల్లు కట్టుకునేందుకు సహాయం చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి పునాది వేసుకున్నాం. బిల్లు కూడా పడింది. సిమెంటు ఇచ్చారు. గ్రూప్ తరఫున రుణం కూడా అందించారు. – నస్రీన్, యాదమరి, చిత్తూరు జిల్లా జగనన్నకు రుణపడి ఉంటాం నాకు వివాహమై దాదాపు 20 ఏళ్లు అయింది. ఒక కుమారుడు, కుమార్తె. పెళ్లయి నప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. ఇంటి స్ధలం కోసం ఎన్నిసార్లు అధికారులను అడిగినా గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఇంటి స్థలం మంజూరైంది. – దోమ లక్ష్మి, మార్టేరు, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా విలువైన స్థలం ఇచ్చారు పల్నాడు జిల్లా వినుకొండ రోడ్డులోని జగనన్న కాలనీలో ఎంతో విలువైన స్థలం ఇచ్చారు. కలలో కూడా నేను ఇల్లు కట్టుకుంటానని అనుకోలేదు. ఇంటి స్థలమిచ్చి,æ నిర్మాణం కోసం డబ్బులిస్తున్నారు. ఇల్లు మొదలు పెట్టాను. పూర్తిచేసి ఆ ఇంట్లోకి వెళ్తాను. చాలా సంతోషంగా ఉంది. – చెరుకూరి లక్ష్మి, లబ్ధిదారురాలు, నరసరావుపేట -
వారిలో సమాజ హితం లేదు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మేలు కోరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే రాష్ట్రంలోని కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని.. వారి రాతల్లో, ప్రసారాల్లో ఏమాత్రం సమాజ హితంలేదని, సొంత సామాజికవర్గ స్ఫూర్తి మాత్రమే కనిపిస్తోందని ఈనాడు, ఈటీవీపై రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2020 జనవరి 9న ఈనాడు పత్రిక ‘ఇవి మీకు తెలుసా?’ అనే శీర్షికన ప్రచురించిన ఫొటోలు, కథనాల్లో రామోజీరావు తాలూకు స్వార్థం, సామాజికవర్గ స్ఫూర్తి కనిపిస్తోందన్నారు. ఆ ఫొటోలను మంత్రి ఉటంకిస్తూ.. 2016 అక్టోబర్ నుంచి సచివాలయంలో పాలన సాగుతోందని.. 2017 మార్చి నుంచి శాసనసభా సమావేశాలు జరుగుతున్నాయని రాశారన్నారు. అయితే, అవి జరుగుతున్నవి తాత్కాలిక భవనాల్లో అనే విషయం వాస్తవమా, కాదా? అని రామోజీరావును చెప్పమనండి? అని బొత్స సూటిగా ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రంలో 2019 జూలై నుంచి రాజ్‌భవన్ పనిచేస్తోందని, జగన్ అధికారంలోకి వచ్చాక గతంలో మాజీ ముఖ్యమంత్రి వినియోగించిన ఈ భవనాన్ని ఆయనకు కేటాయించారన్నారు. అంతేకాదు.. విజయవాడ, గుంటూరులో అద్దె భవనాల్లో కొన్ని, సొంత భవనాల్లో కొన్ని ప్రభుత్వ శాఖలున్నాయనేది కూడా నిజమేననీ.. అయితే హంగులన్నీ ఉన్న అమరావతికి అదనంగా ఖర్చుచేయాల్సిన అవసరంలేదని మరో పెద్ద శీర్షికతో కథనం రాసిందని ఆయన ప్రస్తావించారు. అమరావతిలో అన్ని హంగులూ ఉంటే రాజధాని నిర్మాణానికి రూ.1.09 లక్షల కోట్లు అవుతుందని ఇదే ఈనాడు పత్రిక 2018 డిసెంబర్ 24న ‘నిలువెత్తు దగా’ అని వార్త ఎలా రాశారన్నారు. నిజంగా అంతా అయిపోయి ఉంటే మొన్నటి ఎన్నికలకు ముందు రూ.53 వేల కోట్ల మేరకు టెండర్లు ఎందుకు పిలిచారో చెప్పాలి? అన్నారు. అలాగే, గురువారం 2020 జనవరి 9 నాటి కథనంలో రూ.3 వేల కోట్లు ఖర్చుచేస్తే అంతా అయిపోతుందని రాశారని బొత్స అన్నారు. ఎన్నికలకు ముందేమో దగా అని రాసి ఇప్పుడేమో అద్భుతం అంటారా? అని ఆయన విస్మయం వ్యక్తంచేశారు. శివరామకృష్ణన్ నివేదికను ప్రచురించాలి రాష్ట్ర విభజన నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందో ఈనాడులో ప్రచురించాలని బొత్స డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వంత పాడొద్దని రామోజీరావుకు ఆయన హితవు పలికారు. కాగా, విశాఖపట్నానికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు దూరం, దగ్గరని రాస్తున్నారని.. మరి విశాఖపట్నం విజయవాడకు 400 కిలోమీటర్లు ఉన్నపుడు విజయవాడ నుంచి విశాఖ ఏమైనా 40 కిలోమీటర్లే ఉంటుందా? దూరం కాదా? అని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో ఉన్న వారు మనుషులు కారా? వారికి అభివృద్ధి అవసరంలేదా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబును లక్షల కోట్లు అప్పు తీసుకువచ్చి ఏం చేశారని రామోజీరావు ఏనాడూ తన పత్రికలో ఎందుకు అడగలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రాంతీయ అసమానతలను తగ్గించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్ వార్తలకు తాము భయపడేదేలేదని బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. పవన్‌కు కోపం వస్తే కవాతు అంటే ఎలా? కాగా, రాజధాని ప్రాంతంలో పవన్‌కళ్యాణ్ చేస్తానని చెబుతున్న నిరసన కవాతు గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘ఆయనకు కోపం వచ్చినపుడు కవాతు అంటే ఎలా? ఆయన మాదిరిగా మాకు కేకలు వేయడం, యాక్షన్ చేయడం రాదు’ అని బొత్స బదులిచ్చారు. అసలు ఆయనకు ఏ విషయంపై కూడా స్పష్టతలేదన్నారు. రైతులు చంద్రబాబు ఉచ్చులో పడొద్దని, గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన స్పష్టంచేశారు. ఎన్ని గొంతుకలో? ఈనాడు పత్రిక ఎన్నికలకు ముందు ఒక గొంతుక, ఎన్నికలయ్యాక మరో గొంతుకను వినిపిస్తోందని బొత్స ధ్వజమెత్తారు. రామోజీరావులో సమాజ స్పృహ కన్నా సామాజికవర్గ స్పృహ ఎక్కువగా ఉందని.. ఎందుకీ పాపపు మాటలని ప్రశ్నించారు. వయస్సు, అనుభవం పెరిగిన ఆయన ఇంకా ఏం సాధించడానికి ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. వీరి వ్యవహారం చూస్తుంటే.. వారి మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే ఒకలా వార్తలు.. మరొకరు సీఎం అయితే ఇంకోలా రాస్తారన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులందరూ మీ అడుగులకు మడుగులు ఒత్తాలా? మీకు తొత్తులుగా ఉండాలా? అని ఆయన మండిపడ్డారు. -
శవ రాజకీయాలకు తెరతీసిన టీవీ 5, ఈటీవీ
బాపట్లటౌన్ : మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ఇసుక కొరతకు ఆపాదించి టీవీ5, ఈటీవీ ప్రతినిధులు చేసిన శవరాజకీయాన్ని మృతుడి కుటుంబ సభ్యులే బట్టబయలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని భర్తిపూడి గ్రామంలో సోమవారం సాయంత్రం నలుకుర్తి రమేష్ (39) ఇంట్లోనే ఉరేసుకుని మృతి చెందాడు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన టీవీ5, ఈటీవీ ప్రతినిధులు శవరాజకీయం మొదలు పెట్టారు. ‘ఉరివేసుకొని చనిపోవడానికి కారణం ఇసుక లేకపోవడమేనని చెప్పండి.. మీ ఇంటికి ఎవరొచి్చనా ఇదే విధంగా చెప్పండి.. మేము కూడా ఇదేవిధంగా టీవీల్లో చూపిస్తాం. ఇలా చేస్తే మీకు రూ.5 లక్షలు డబ్బులొస్తాయి. లేకపోతే ఏమీ రావు’ అని చెప్పి ప్రలోభపెట్టారు. అలాగే ప్రచారం చేశారు. అయితే రమేష్ కుటుంబ సభ్యులు మంగళవారం ఆ దుష్ప్రచారాన్ని ఖండించారు. రమేష్‌కు గత కొన్నేళ్లుగా ఫిట్స్ వస్తుండటంతో ఎక్కడపడితే అక్కడ పడిపోతూ ఉండేవాడని అతని సోదరుడు సురేష్ చెప్పారు. దీనికితోడు గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడన్నారు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అసలు తన తమ్ముడు తాపీ పని ఏమీ చేయడని, బాగున్న సమయంలో పొలం పనులకే వెళ్లేవాడని సురేష్ వివరించారు. ఆ టీవీల ప్రతినిధులు డబ్బులు వస్తాయని ఆశ చూపడంతో మొదట అలా చెప్పామని, తప్పని తెలిసి ఇప్పుడు వాస్తవం చెబుతున్నామన్నారు. -
వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం: చానళ్లకు నోటీసులు
-
వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం: చానళ్లకు నోటీసులు
జగన్‌పై మరోసారి ఎల్లో మీడియా వీరంగం - మూడు చానెళ్లకు జగన్ లాయర్ల లీగల్ నోటీసులు - ఏపీ విపక్ష నేత లక్ష్యంగా టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ విష కథనాలు - ఈడీ ట్వీట్లకు సొంత కథను జోడించి మరీ ప్రసారం... సాయంత్రం ఈడీ చేసిన ప్రకటనను పట్టించుకోని వైనం - ఇదంతా దురుద్దేశపూర్వకంగానే చేశారన్న జగన్ న్యాయవాదులు సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఎల్లో మీడియా మళ్లీ విషం గక్కింది. అదిగో తోక అంటే.. ఇదిగో మేక అన్న చందాన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం ఇచ్చిన రెండు ట్వీట్లను పట్టుకుని ఎల్లో చానెళ్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9, ఈటీవీ రసవత్తరమైన కథను అల్లి పారేశాయి. అసలు ఈడీ ఏం చెప్పిందో.. ఎవరెవరినుద్దేశించి చెప్పిందో కూడా పట్టించుకోకుండా తమకు అలవాటైన తప్పుడు కథనాల్ని నిస్సంకోచంగా ప్రసారం చేసేశాయి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా తమ నాయకుడు చంద్రబాబునాయుడు ఇరుకున పడటం, ఓటుకు కోట్లు కేసులో సాక్షాత్తూ చంద్రబాబుకే సుప్రీంకోర్టు నోటీసులివ్వటం... వీధి రౌడీల్ని మరిపిం చిన ఏపీ మంత్రుల గూండాగిరీని జనం అసహ్యించుకోవటం... ఏపీలో పెరుగుతున్న విచ్చలవిడి అవినీతిపై జాతీయ మీడియాలోనూ వార్తలొస్తుండటంతో... వీటన్నిటి నుంచి జనం దృష్టిని మళ్లించటానికి ఎల్లో చానెళ్లు శనివారం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేశాయి. అసలు ఏం జరిగిందంటే...: మనీ లాండరింగ్ ఆరోపణలెదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం చగన్ భుజబల్, నేషనల్ రూరల్ హెల్త్‌మిషన్ స్కాం ఆరోపణలెదుర్కొంటున్న యాదవ్ సింగ్, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ఇతర కేసుల్లో ఆరోపణలొచ్చిన ఏజీఎస్ ఇన్ఫోటెక్, రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్స్ ఇలా పలు సంస్థలు, వ్యక్తులకు చెందిన షెల్ కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్లు సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ట్వీట్ చేసింది. వివిధ అంశాలకు సంబంధించి తాము సోదాలు జరిపిన సంస్థలు దేశ వ్యాప్తంగా 300 వరకూ ఉంటాయని కూడా మరో ట్వీట్లో తెలియజేసింది. నిజానికి ఇందులో రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్స్ అనే సంస్థ యారో గోల్డ్ జ్యుయలరీ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి రితేష్ జైన్‌ది. ఈ సంస్థ ద్వారా వందల కోట్ల రూపాయలు లాండరింగ్ జరిగిందని ఈ నెల మొదట్లోనే ఈడీ ప్రకటించింది. దానికి సంబంధించి కొందరిని అరెస్టు చేసింది కూడా. తాజాగా దీనికి చెందిన మరికొన్ని కంపెనీల్లోనూ సోదాలు జరిపినట్లు ప్రకటించింది. ఎన్ఆర్హెచ్ఎం, చగన్ భుజబల్ వ్యవహారాలు కూడా ఇదివరకు ఈడీ పేర్కొన్నవే. ఎల్లో మీడియాకు ఇది చాలదా! ఈడీ ట్వీట్లను పట్టుకుని, రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్స్‌తో జగన్మోహన్రెడ్డికి సంబంధాలున్నాయని, అదంతా ఈడీ చెప్పిందని, ఈ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని... ఇంకా ఏవేవో పచ్చి అబద్ధాలను వండేసింది ఎల్లో మీడియా. కనీసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే పదాన్ని సరిగా పలకటం కూడా చేతకాకపోయినా... దానికి సొంత కవిత్వాన్ని జోడించి ఈ చానెళ్ల ప్రతినిధులు జగన్‌పై కథనాల్ని వండేయటం చూస్తే వీళ్ల ఎల్లో జర్నలిజం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం కాకమానదు. బహుశా.. ఇదంతా చూసో ఏమో.. ఈడీ సాయంత్రం సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. అందులో వివిధ ఆరోపణలున్న పలువురు వ్యక్తులు, సంస్థల పేర్లు చెబుతూ... వాటికి సంబంధించి తాము వివిధ కంపెనీల్లో సోదాలు జరిపామని మాత్రమే పేర్కొంది. ఈ ప్రకటనలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి చెందిన కంపెనీలు... అని తప్ప ఒక్క కంపెనీ పేరుగానీ, వేరొక కంపెనీతో సంబంధాలున్నట్లు గానీ ఎక్కడా పేర్కొనలేదు. కానీ ఎల్లో మీడియాకు ఇదేమీ పట్టలేదు. ఎందుకంటే ఆ మూడు చానెళ్లు అప్పటికే వండాలనుకున్న కథనాల్ని వండేశాయి. మూడు చానెళ్లకు లీగల్ నోటీసులు కాగా రాజేశ్వర్ ఎక్స్పోర్ట్ అనే కంపెనీ పేరు కూడా తమ క్లయింట్‌కు తెలియదని, అలాంటిది ఆ కంపెనీతో సంబంధాలు అంటగడుతూ.. కథనాలు ప్రసారం చేయటం ఉద్దేశపూరితంగా తన క్లయింట్ ప్రతిష్టను దెబ్బ తీయటానికేనని జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఏమాత్రం ధ్రువీకరించుకోకుండా, ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ప్రసారం చేసిన ఈ వార్తాకథనాల వెనక తీవ్ర స్థాయి దురుద్దేశాలున్నట్లు వారు అభిప్రాయపడ్డారు. అందుకే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9, ఈటీవీ చానెళ్లకు లీగల్ నోటీసులు జారీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రాజకీయం తప్ప ఏముందిందులో? నిజానికి ‘సాక్షి’లో పెట్టుబడులకు సంబంధించి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై పెట్టిన కేసులన్నీ రాజకీయ పూరితమైనవని ఆది నుంచీ నిరూపితమవుతూనే ఉంది. జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాక కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి కేసులు వేయటం, మూడు నెలల్లో బెయిలు రావాల్సిన కేసులో... 16 నెలలకు పైగా జైల్లో ఉంచటం ఇవన్నీ తెలియనివేమీ కావు. అంతేకాదు.. సోదాల నుంచి మొదలు పెడితే ముక్కలు ముక్కలు చార్జిషీట్లు వేయటం వరకూ ఏ కేసులోనూ జరగని వింతలన్నీ ఈ కేసులోనే చోటుచేసుకున్నాయి. అసలు జగన్మోహన్రెడ్డిని ఏమాత్రం ప్రశ్నించకుండానే ఆయనపై తొలి చార్జిషీటును వేయటం చూస్తే... ఈ కేసు ఎలా సాగిందన్నది ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఈ దశలో కూడా ఏపీలో జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను దెబ్బతీయాలని, ఆయన పార్టీ నేతల్ని గందరగోళంలో పడెయ్యాలనే ఉద్దేశంతో చంద్రబాబు కేంద్ర స్థాయిలో తనకున్న లింకుల్ని ఉపయోగించి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లో మీడియాతో సహా పలు వర్గాల్ని రంగంలోకి దింపుతున్నారు. దర్యాప్తు పూర్తయి, విచారణ జరుగుతున్న ప్రస్తుత దశలో కూడా జగన్మోహన్ రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ సీబీఐ ఇటీవలే పిటిషన్ వేయటం గమనార్హం. ఆ పిటిషన్ విచారణకు వస్తున్న దశలో దాన్ని ప్రభావితం చెయ్యాలన్న ఉద్దేశంతో ఎల్లో మీడియా మళ్లీ శివాలెత్తటం వెనక పరిణామాల్ని తేలిగ్గానే ఊహించుకోవచ్చు. -
‘జబర్దస్త్’ వేణుపై దాడి
బంజారాహిల్స్: ఈటీవీలో ప్రసారమౌతున్న ‘జబర్దస్’్త షో ఫేం వేణుపై గౌడ కులస్తులు ఆదివారం ఉదయం దాడి చేశారు. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్‌లోని అయ్యప్ప ఆలయానికి వచ్చిన వేణును చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కామెడీ కోసమే ఆ స్క్రిప్ట్ తయారు చేశానని, ఒక కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అతను చెప్తుండగానే వారు దాడి చేశారు. దీంతో కిందపడిపోయిన వేణు వారి నుంచి తప్పించుకొని సమీపంలో ఉన్న ఫిలింనగర్ అవుట్‌పోస్ట్‌లో దూరాడు. గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వట్టికూట రామారావు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ విద్యార్థులు ఫిలించాంబర్ వద్దకు చేరుకున్నారు. వేణు ప్రదర్శించిన స్క్రిఫ్ట్ వల్ల కోటి మంది గౌడ కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అతను బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని రామారావు డిమాండ్ చేశారు. జబర్దస్త్ టీమ్, ఈటీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో రెండు గంటలపాటు ఫిలించాంబర్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. వేణును ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కూడా గౌడ విద్యార్థులు అడ్డుపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువురిపై కేసు నమోదు తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేణు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గౌడ విద్యార్థి సంఘం నేతలపై ఐపీసీ 341, 323 కింద కేసులు నమోదు చే శారు. వేణు కూడా తమపై దాడి చేశాడంటూ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేణుపై ఐపీసీ 323, 509కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘జబర్దస్త్’పై గౌడ నేతల ఫిర్యాదు
జవహర్‌నగర్: శ్రామిక గౌడ మహిళాజీవన విధానాన్ని అవమానపర్చిన ‘జబర్దస్త్’ కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం జిల్లా నాయకులు శనివారం జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఈనెల 18న రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో ప్రసారమైన ‘జబర్దస్త్’ కార్యక్రమంలో కల్లు వృత్తిని, శ్రామికగౌడ మహిళా జీవన విధానాన్ని అవమానించే విధంగా స్కిడ్ ప్రసారం చేశారని, గతేడాది జూలై 11న కూడా ‘జబర్దస్త్’లో కల్లుగీత కార్మికుల్ని ఘోరంగా అవమానించారని అన్నారు. కుల వృత్తులతోపాటు మహిళలను కించపరిచే విధంగా ఉన్న స్కిట్‌ను ప్లే చేసిన ఆర్టిస్టులతోపాటు కార్యక్రమ న్యాయ నిర్ణేతలు, యాంకర్, ప్రసారం చేసిన ఈటీవీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు బి. నరేష్‌గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు అశోక్‌గౌడ్, కారింగుల రాజుగౌడ్, నవీన్‌గౌడ్ తదితరులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలిస్తున్నామని సీఐ వెంకటగిరి తెలిపారు. -
'మార్గదర్శి' మాయాజాలం