
మల్కాజిగిరి: టీవీ9 ఇస్మార్ట్ న్యూస్‌లో హిందూ దేవతలను కించ పరిచారని బీజేపీ నాయకులు మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈనెల 14వ తేదీన ఉదయం ఇస్మార్ట్ న్యూస్‌లో గ్రామ దేవతను కరో నా అమ్మవారిగా (ఫొటో) మార్చి పూజలు చేసే దృశ్యాలు ప్రసారం చేశారని లేఖలో పేర్కొన్నారు. దీనిని ప్రసారం చేసిన సదరు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, సదానంద్, ధర్మతేజ, భరత్‌యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment