సాక్షి, న్యూఢిల్లీ : టీవీ9 భారత్ వర్ష్ ఛానల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు మాయం అయ్యాయంటూ తప్పుడు కథనాలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవీఎంల భద్రత, తరలింపు అంశాలపై అత్యున్నత నిఘా ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది. తప్పుడు రిపోర్టింగ్ చేయకుండా జర్నలిజం ప్రమాణాలు కాపాడాలని హితవు పలికింది. మీడియా జర్నలిజం విలువలు విడిచి దురద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని ఈసీ అభిప్రాయపడింది. ప్రజల్లోకి తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దని ఈసీ ఈ సందర్భంగా టీవీ9 భారత్ వర్ష్ చానల్‌కు హితవు పలికింది.
కాగా భారత్ వర్ష్ ఛానల్‌ను రవి ప్రకాశ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫోర్జరీ, నిబంధనలకు విరుద్ధంగా ఆయన భారత్ వర్ష్ చానల్‌కు కోట్లు దారి మళ్లించారంటూ టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment