సాక్షి బెంగళూరు: తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ నటుడు రవి ప్రకాశ్‌పై నటి విజయలక్ష్మి చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఆమెపై కర్ణాటక వాణిజ్య మండలిలో రవి ప్రకాశ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కష్టాల్లో ఉన్న ఆమెకు తాను నగదు సాయం చేశారని తెలిపారు. అంతేకానీ ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స కోసం కష్ట సమయంలో సహాయం చేయాలని కోరితే డబ్బులను ఇచ్చినట్లు తెలిపారు. కానీ విజయలక్ష్మి మాత్రం తనను అవమానం చేస్తూ అసభ్యకర పదజాలంతో దూషిస్తోందని చెప్పారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో తన డబ్బులు తనకు ఇచ్చేయాలని, అలాగే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment