vijaya laxmi
-
ఇప్పుడు ‘సేఫ్’ కాదని..
సాక్షి, నరసరావుపేట(గుంటూరు): కోడెల కుటుంబానికి ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే, ఇచ్చిన సొమ్ము తిరిగి రాబట్టుకోవాలంటే కాళ్లావేళ్లా పడాల్సిందే.. వాళ్ల బెదిరింపులకు లొంగి ఉండాల్సిందే.. అలా కాదని ప్రశ్నిస్తే అక్రమ కేసుల్లో జైలుకు వెళతారు. లేదంటే భౌతిక దాడులకు గురవుతారు. ఇదంతా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అధికారం అండతో కోడెల కుటుంబం సాగించిన దందా. అయితే ఇప్పుడు రోజులు మారాయి. పరిస్థితి పూర్తిగా అడ్డం తిరిగింది. అధికార అహంకారంతో నెత్తికెక్కిన కళ్లు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఏదైనా గేటు అవతల ఉండి మాట్లాడమని గద్దించిన నోళ్లు మూతబడ్డాయి. రాజీకి రండంటూ బాధితులను వేడుకుంటున్నాయి. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మి వ్యవహారంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో అక్రమాలు, దందాలకు పాల్పడ్డారు. ఆనాడు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవటంతో ప్రభుత్వం మారిన తర్వాత కేట్యాక్స్ బాధితులంతా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కోడెల కుటుంబంపై క్రిమినల్ కేసులు నమోదవటంతో కోడెల శివరామ్, పూనాటి విజయలక్ష్మి పరారయ్యారు. వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా కేసుల్లో ఉన్న తీవ్రత దృష్ట్యా న్యాయస్థానం సైతం బెయిల్‌ను నిరాకరించింది. దీంతో బాధితుల వద్ద నొక్కేసిన సొమ్మును వెనక్కి ఇచ్చి రాజీలు చేసుకుంటున్నారు. తాజాగా అసెంబ్లీ ఫర్నిచర్ అక్రమ తరలింపు వ్యవహారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడెల కుటుంబం నవ్వులపాలైంది. చివరకు ఆ పార్టీ నాయకులు, సొంత సామాజికవర్గం సైతం చీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. మరో వైపు పోలీసులు కూడా అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో సర్జికల్ వ్యాపారికి ఇవ్వాల్సిన నగదుకు ఎగనామం పెట్టిన కోడెల కుమార్తె తాజాగా ఆ వ్యాపారిని పిలిచి మరీ నగదు చెల్లించడం గమనార్హం. తిన్నది కక్కించారు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన చల్లా రవీంద్రరెడ్డి ఆ గ్రామంలో వెంకటేశ్వర సర్జికల్ కాటన్ పేరిట దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. సర్జికల్ కాటన్‌ను కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన సేఫ్ కంపెనీకి సరఫరా చేశారు. అందుకుగాను సుమారు రూ.15 లక్షలు రవీంద్రరెడ్డికి కోడెల కుమార్తె కంపెనీ నుంచి రావాల్సి ఉంది. నగదు కోసం పలుమార్లు ఆమెను కలిసి అడగ్గా బెదిరింపులకు పాల్పడడంతో బాధితుడు మూడు రోజుల క్రితం గుంటూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం సైతం కేట్యాక్స్ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తుండటంతో మరో దారి లేక ఆయనకు ఇవ్వాల్సిన నగదుకు సంబంధించి విజయలక్ష్మి సంతకం చేసిన రూ.14.40 లక్షల రూపాయల విలువైన రెండు చెక్కులను శుక్రవారం సేఫ్ కంపెనీ మేనేజర్ అందజేశారు. తండ్రి బాటలోనే తనయ అక్రమాలు చేయటం, వాటిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరిదిద్దుకోవటంలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది అందె వేసిన చేయిగా చెప్పుకుంటారు. అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం బయట పడగానే.. తీసుకున్న ఫర్నిచర్‌కు డబ్బులు చెల్లిస్తానని బుకాయించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ఆయన కుమార్తె విజయలక్ష్మి వెంకటేశ్వర సర్జికల్ కాటన్ యజమాని రవీంద్రరెడ్డికి ఇవ్వాల్సిన డబ్బులు ముట్టచెప్పి కేసు మాఫీకి యత్నించడం గమనార్హం. -
నటి విజయలక్ష్మిపై రవిప్రకాశ్ ఫిర్యాదు
సాక్షి బెంగళూరు: తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ నటుడు రవి ప్రకాశ్‌పై నటి విజయలక్ష్మి చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఆమెపై కర్ణాటక వాణిజ్య మండలిలో రవి ప్రకాశ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కష్టాల్లో ఉన్న ఆమెకు తాను నగదు సాయం చేశారని తెలిపారు. అంతేకానీ ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స కోసం కష్ట సమయంలో సహాయం చేయాలని కోరితే డబ్బులను ఇచ్చినట్లు తెలిపారు. కానీ విజయలక్ష్మి మాత్రం తనను అవమానం చేస్తూ అసభ్యకర పదజాలంతో దూషిస్తోందని చెప్పారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో తన డబ్బులు తనకు ఇచ్చేయాలని, అలాగే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
సాయం చేసి వేధించారు.. నటుడుపై నటి ఫిర్యాదు
యశవంతపుర (కర్ణాటక): అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటి విజయలక్ష్మీ.. తనను నటుడు రవి ప్రకాశ్ మానసికంగా లైంగికంగా వేధించిన్నట్లు పుట్టేనహళ్లి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. తను కొద్దిరోజుల నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఫిబ్రవరి 27న నటుడు రవిప్రకాశ్ ఆస్పత్రికీ వచ్చి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. అనంతరం ప్రతిరోజూ ఐసీయూకు రావడం, పదేపదే ఫోన్ మేసెజ్‌లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించేవారన్నారు. ఈ మేరకు ఆమె కన్నీరు పెట్టుకుని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వైరల్‌గా మారింది. వేధించలేదు: రవిప్రకాశ్ ఆమె ఆరోపణలను నటుడు రవి ప్రకాశ్ ఖండించారు. మీడియాలో సాయం చేయాలని కోరటం వల్ల ఆమెకు లక్ష రూపాయలను సాయం చేశాను గానీ లైంగికంగా వేధించలేదని చెప్పారు. ఆమెతో తను మాట్లాడిన కాల్ రికార్డ్ ఉందన్నారు. కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయటమే తప్పా అన్నారు. -
సాయం కోసం నటి విజయలక్ష్మీ వినతి
కర్ణాటక, యశవంతపుర: శాండల్‌వుడ్ నటీమణి ఆరోగ్యం బాగాలేక, ఆర్థిక సమస్యలతో సాయం కోసం నిరీక్షిస్తోంది. నాగమండల, సూర్యవంశ, నంబర్ ఇన్ సినిమాలలో నటించిన నటి విజయలక్ష్మీ ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేనందున సాయం చేయాలని ఆమె సోదరి అభిమానులకు విన్నవించారు. ఇటీవల బుల్లితెరపై బిజీగా ఉన్న విజయలక్ష్మీ నీరసం, అధిక రక్తపోటుతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆమె తల్లికీ అనారోగ్యం రావటంతో ఆమె చికిత్సకు పెద్దమొత్తంలో డబ్బులను ఖర్చు చేశారు. ఇప్పుడు విజయలక్ష్మికీ అనారోగ్యం తలెత్తింది. తన అక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున చికిత్సకు అర్థిక సాయం చేయాలని ఆమె సోదరి ఉపాదేవి మనవి చేశారు. టీవీలు, సినిమాలలో అవకాశాలు సన్నగిల్లడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని సమాచారం. దీనితో చిత్రరంగ నటీ, నటులు చేయూతనివ్వాలని ఉషాదేవి కోరారు. -
వైఎస్ఆర్ సీపీలో చేరిన పోలు విజయలక్ష్మి
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజమండ్రి కాంగ్రెస్ నాయకురాలు పోలు విజయలక్ష్మితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కాగా, ఇవాళ 70వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు వైఎస్ జగన్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్ఆర్ సీపీలో చేరిన పోలు విజయలక్ష్మి
-
'సుశీల్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కొడుకు సుశీల్ కుమార్ ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై తెలంగాణ మైనార్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మైనార్టీ కమిషన్ చైర్మన్ పోలీసులను కోరారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని బంజారాహిల్స్ కార్పొరేటర్, ఎంపీ కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి పోలీసులను కోరారు. బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు. నిందితున్ని అరెస్టు చేసేంతవరకు ఊరుకునేది లేదని ఆమె 'సాక్షి'తో మాట్లాడుతూ తెలిపారు. గుంటూరులోనూ నిరసనలు! పత్తిపాడు: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన మంత్రి కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లాలో ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. మంత్రి కొడుకైతే అతనికి ఏమైనా కొమ్ములు ఉంటాయా.. రాజ్యాంగానికి అతీతుడా అని నినాదాలు చేస్తూ.. మైనార్టీ సంఘాల నాయకులు రాస్తారోకో చేస్తున్నారు. ప్రత్తిపాడులోని ఓల్డ్ మద్రాస్‌రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పాఠశాల నుంచి వస్తున్న ఉపాధ్యాయురాలి చేయి పట్టుకొని లాగిన వ్యక్తిపై కేసు పెట్టకుండా అతనికి సాయం చేసిన డ్రైవర్‌పై కేసు పెట్టి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. -
ఇంతకీ మేయర్ ఎవరో!
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతంగా అధికారం చేపట్టేందుకు కావల్సిన మెజారిటీని సాధిస్తున్న టీఆర్ఎస్.. ఇక తమ మేయర్ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించాల్సి ఉంది. కాంగ్రెస్ లాంటి పార్టీలు ముందుగా తమ మేయర్ అభ్యర్థులను ప్రకటించినా, టీఆర్ఎస్ మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. ప్రధానంగా మాత్రం చర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేసిన బొంతు రామ్మోహన్, బంజారాహిల్స్ డివిజన్ నుంచి పోటీ చేసిన ఎంపీ కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. బొంతు రామ్మోహన్ ముందు నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరించారు. నగరం మొత్తం ఏదోలా తన పేరు వినిపించేలా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి, అక్కడి నుంచి టీఆర్ఎస్కు వచ్చిన సీనియర్ నాయకుడు కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి పోటీ చేశారు. ఆమెకు కూడా సముచిత స్థానం ఇవ్వచ్చనే వాదన వినిపించింది. దీంతో ప్రధానంగా మేయర్ పదవి కోసం ఎక్కువ పోటీ బొంతు రామ్మోహన్, విజయలక్ష్మిల మధ్యే ఉంటుందని తెలుస్తోంది. మాదాపూర్ డివిజన్ నుంచి గెలిచిన జగదీశ్వర్ గౌడ్ పేరు కూడా ఓ దశలో వినిపించింది. అయితే ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. మాదాపూర్ నుంచి ఆయన, హఫీజ్‌పేట నుంచి ఆయన భార్య పూజిత కార్పొరేటర్లుగా పోటీ చేశారు. తాము గెలిస్తే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ మేయర్ అవుతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా.. జాంబాగ్ డివిజన్ నుంచి పోటీ చేసిన విక్రమ్‌గౌడే ఓడిపోయారు. -
విశాఖలో మహిళా టీచర్ వీరంగం
-
విశాఖలో మహిళా టీచర్ వీరంగం
విశాఖ: విశాఖ జిల్లాలోని అనకాపల్లి మండలం కొండకొప్పాక హైస్కూల్లో మంగళవారం ఓ మహిళా టీచర్ వీరంగం సృష్టించింది. హైస్కూల్లో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మి.. సహా ఉపాధ్యాయులపై విరుచకపడింది. స్కూల్లో బెంచీలు, కుర్చీలను తన్నుతూ టీచర్లను కొట్టింది. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో విజయలక్ష్మి ఇలా ప్రవర్తిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. -
పెద్దాపురంలో మహిళ బలవన్మరణం
పెద్దాపురం: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. పెద్దాపురంలోని సత్తెమ్మ కాలనీకి చెందిన వై. విజయలక్ష్మి (30) భర్త ఇటీవల మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె మానసికస్థితి సరిగా ఉండటం లేదు. అయితే ఆదివారం రోజున విజయలక్ష్మి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, విజయలక్ష్మికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
కథ: తోడూ నీడా
‘‘మినపరుబ్బు కొంచెం ఉంటే తెచ్చానమ్మా. నూక కలిపిందే. నాకు చిన్న రొట్టి కాల్చి మిగతాది ఉదయం ఇడ్లీకి ఉంచు..’’ అంటూ తను తెచ్చినవన్నీ, బయటకు ఒక్కొక్కటీ పెట్టింది. పిల్లలకి సున్నుండలు, మధుకి ఇష్టమని జంతికలు, చెరుకు ముక్కలు, అనకాపల్లి ఫేమస్ చిన్న బెల్లం దిమ్మ, పచ్చళ్లు పేరిన నెయ్యి... ఇవన్నీ చూసి పిల్లలు సంబరపడిపోయారు. ‘‘అమ్మా!’’ ‘‘మమ్మీ!’’ ‘‘అబ్బబ్బా! ఎందుకర్రా ఆ కేకలు. ఏదో భాషలో పిలవండి. ఏమయింది?’’ వంటింటిలోంచి వస్తున్న సుమతిని చూస్తూ షేవ్ చేసుకుంటున్న మధు అద్దంలోంచి చూస్తూ నవ్వుతున్నందుకు ఉడుక్కుని, ‘‘ఊ! అలా నవ్వే బదులు వాళ్లను కాస్త చూడొచ్చు కదా, ఎందుకరుస్తున్నారు?’’ ‘‘అది నీ సెక్షనోయ్!’’ ‘‘అవును. ఈ సెక్షనాఫీసరుగారికి ఇంట్లో కూడా రూల్సే. ఇంతకీ ఏమిటర్రా మీ గోల?’’ ‘‘ఈ పొట్టోడు జామంతా ఉత్తినే తినేస్తున్నాడు. మరి నేనెలా తినాలి ఈ బ్రెడ్డుని?’’ దీర్ఘం తీసింది సిరి. దానికే ఎనిమిదేళ్లు. దాని కన్నా ఏడాది చిన్న ఫణి. వాడు దీనికి పొట్టోడు. ఇది మరీ పొడుగ్గా ఉన్నట్లు. నవ్వాపుకుంటూ, ‘‘పోనీలే. ఈసారికి పాలల్లో వేసిస్తాను. నా తల్లివి కదూ. వేగిరం తినాలి. టైమవుతుంది. ఆటో వచ్చేస్తుంది. మరి రేపు నీకు వేరే జాము కొంటాను కదూ.’’ ‘‘మమ్మీ! రోజూ ఈ బ్రెడ్డేనా? ఏదైనా టిఫిన్ చెయ్యమ్మా?’’ ‘‘అలాగే. రేపు సండే కదా. పూరీ చేస్తాను. సరేనా?’’ పిల్లలిద్దరికీ బాక్సులు సర్ది, వాళ్లని ఆటో ఎక్కించి వచ్చినప్పటికి శ్రీవారు రెడీ. అతనికి కొంచెం పెరుగన్నం పెట్టి, తనూ రెండు ముద్దలు ఆదరాబాదరాగా తిని, ఇద్దరికీ టిఫిన్ బాక్సులు సర్ది, తను తయారైనప్పటికి తొమ్మిదిన్నర. డోర్ లాక్ చేసి, పరుగుపరుగున వచ్చి కూర్చున్న సుమతిని చూసి, ‘‘గ్యాస్ కట్టావా? మొన్నటిలా మర్చిపోయావా?’’ బైక్ స్టార్ట్ చేస్తూ అడిగాడు మధు. ‘‘మొన్న ఏదో తొందరలో అలా చేశానుగాని, ఎప్పుడూ జాగ్రత్త గానే ఉంటాను.’’ వీళ్లు ఏం మాట్లాడుకున్నా ఆ పావుగంట ప్రయాణంలోనే. అన్ని కబుర్లనూ. సుమతి ఆఫీసు ముందు వస్తుంది. తనని అక్కడ డ్రాప్ చేసి, మధు ఆఫీస్‌కి వెళ్తాడు. సాయంత్రం మాత్రం వీలుపడదు. సుమతి ముందుగా వస్తుంది ఆటోలో. పిల్లలు, అప్పటికే వచ్చి వరండాలో కూర్చుని ఉంటారు. ఆఫీసులో లంచ్ టైమ్‌లో కలిసింది సుధ. ఇద్దరూ ఒకే దగ్గర పనిచేస్తున్నా గాని, వాళ్లు కలిసేది, ఈ లంచ్ టైమ్‌లో మాత్రమే. ‘‘ఏమిటే! అలా ఉన్నావు? కొంచెం డల్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నావు. ఎనీ ప్రాబ్లమ్?’’ కూర్చుంటూ అడిగింది. ఉదయం సిరి అన్న మాటలు చెప్పి, ‘‘వాళ్లు ఎదిగే వయసులో సరైన సంరక్షణ చేయలేకపోతున్నానేమో అనిపిస్తుంది. అప్పటికి ఉదయం ఐదింటికే లేస్తాను. గదులు ఊడ్చి, స్నానం చేసి, కుక్కరు పెట్టి, దేవునికి ఒక దీపం పెట్టేటప్పటికి వీళ్లు లేస్తారు. వాళ్ల పనులు చూసి వంటయేటప్పటికి వీళ్ల ఆటో ఎనిమిదింటికి వస్తుంది. వాళ్లని తయారుచేసి పంపేటప్పటికి ఈయన రెడీ అవుతారు. ఆయనకి, నాకు బాక్సులు కట్టుకుని, తయారయ్యేప్పటికి టైమవుతుంది. ఏం చేయడం? ఆఫీసు పది గంటలకైనా, ఈ ట్రాఫిక్ నుండి తొమ్మిదిన్నరకే బయల్దేరాల్సొస్తుంది’’ ‘‘మీవారేమి సాయం చేయరా?’’ ‘‘చేస్తారు. పిల్లలకి షూస్ వేయడం, వాళ్ల పనులు కొంచెం చూస్తారు.’’ ‘‘పనమ్మాయి ఉంది గాబోలు.’’ ‘‘ఆ! అది వచ్చేప్పటికి మేము వెళ్లిపోతాం. వరండాలో సామాన్లు పడేస్తే, తోమి వెళ్తుంది. సాయంకాలం రాదు. ఆదివారం నాడు ఇల్లు వత్తుతుంది. దానికే, ఆరు వందలు. మరి ఏం చేస్తాం? తప్పదు. అప్పటికి క్యారియర్లు, అన్నీ నేనే కడుక్కుంటాను.’’ సింక్‌లో చేతులు కడుక్కువచ్చి, ‘‘అన్నట్లు సుమా! మీ అత్తగారు ఆ పల్లెటూరులో ఒక్కళ్లే ఉండే బదులు మీ దగ్గరే ఉండొచ్చు కదా! నీకూ కొంచెం సాయం ఉంటుంది. పిల్లలకీ బాగుంటుంది.’’ ‘‘నిజమే గాని! ఆవిడ ఆ ఊరు వదలి రారు. ఎప్పుడైనా వచ్చినా అదే టైముకి నాకు డేట్సు వస్తాయి. వారం కన్నా ఎక్కువ ఉండరు. మా అత్తగారిది ఉమ్మడి కుటుంబం. ఈవిడ వాళ్లతో కలిసే ఉంటుంది. మా చినమామగారిది, మాది పక్కపక్కన ఇళ్లే. పక్కనే ఉన్నారు గనుక ఆవిడకు తోడుగా ఉన్నారని మేము అంతగా బలవంతం చేయలేదు. అదీగాక, ఆవిడకు కొంచెం మడీ తడీ ఎక్కువ. నెలనెలా ఇదొక ప్రాబ్లమ్ కదా. ఇన్నాళ్లూ అంటే ఖాళీగా ఉన్నాను గనక పర్వాలేకపోయింది. ఈ వచ్చింది గవర్నమెంటు జాబు. మానలేను.’’ ‘‘మానమని ఎవరు చెప్పేరే? నువ్వు కొంచం సర్దుకుపోతే బాగుంటుంది కదా. ఆ మూడు రోజులు. వంటింటివైపు వెళ్లకు. నువ్వు కొంచం ఎడంగా ఉంటే, ఆవిడే సర్దుకుంటారు. పెద్దవాళ్లు కదా, వాళ్లకి కొన్ని ఆచారాలు ఉంటాయి. అయినా, మన పూర్వీకులు చాలా తెలివిగా ఈ కట్టుబాట్లు పెట్టారు. పూర్వం అందరివీ ఉమ్మడి కుటుంబాలు. జనాభాలూ ఎక్కువే ఉండేవి. అలాగే, ఆడవాళ్లకి పనులు కూడా ఎక్కువే ఉండేవి. అందుకే, ఆ సమయంలో ఆడవారికి రెస్టు ఉండాలన్న ఉద్దేశంతో, ఆ నియమాన్ని అలా పెట్టారు. చూశావా? మన పూర్వీకులకి స్త్రీల పట్ల ఎంత అభిమానము, గౌరవమో! లేకపోతే, ఉమ్మడి కుటుంబాల్లో కోడళ్ల పని అయిపోయేదే! ఆ పద్ధతి ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో పెద్దవాళ్లు పాటిస్తున్నారు. అంతే! దానికి మనమే ఎడ్జస్టయిపోతే సరిపోతుంది కదా’’ అని వాచీ చూసుకులేచి సుమతి భుజం మీద చెయ్యేసి, నవ్వుతూ, ‘‘గాడ్ బ్లెస్ యూ’’ అంటూ వెళ్లిపోయింది. సుమతికి ఇంటికి వెళ్లినంతవరకూ ఇవే ఆలోచన్లు. ‘‘నిజమే! సుధ చెప్పినట్లు చేస్తే బాగుణ్ను గాని, ఆవిడ వస్తారా? ఈ సంగతి మధుకి ఎలా చెప్పడం? ఏమనుకుంటారు? నీ సాయం కోసం అమ్మని తెమ్మంటావా అంటారేమో! ఏమని చెప్పాలి?’’ ఆలోచన్లలోనే పనులు చేసుకుంటోంది. మధు రానే వచ్చాడు. వస్తూనే, ‘‘సుమా! చిన్న న్యూస్, ఇలారా?’’ అంటూ కూర్చుని బూట్లు విప్పుకుంటూ సోఫాకి చేరబడి, సుమతి ఇచ్చిన టీ అందుకుంటూ, ‘‘చిన్నాన్న ఫోన్ చేశారోయ్! ఈ వర్షాలకి మన ఇల్లు కారుతోందట. ఇల్లు రిపేరు చేయించాలి. అమ్మను తీసుకెళ్లమని చెప్పారు. రేపు ఆదివారం. వెళ్లి తెస్తాను. ఏమంటావు?’’ తనేమంటుంది? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు... సుమతి మనసులో సంశయం తీరిపోయింది. ‘‘ఏమంటాను? తప్పక తీసుకురండి. పాపం! ఒక్కళ్లే ఏం ఇబ్బంది పడుతున్నారో’’ అంది సంతోషంగా. పిల్లలు కూడా సరదా పడ్డారు నానమ్మ వస్తుందని. మర్నాడే ఉదయం బస్సుకి వెళ్లాడు మధు. సాయంత్రంకల్లా రానే వచ్చేశారు. అనకాపల్లి ఎంత దూరమని, రెండు గంటల ప్రయాణం. రాగానే ఇద్దరి మనవల్ని దగ్గరకు తీసుకుని ముద్దులాడి, సుమతిని పలకరించింది జానకమ్మ. అత్తగారి కాళ్లకి నమస్కరించి, కుశలాలు పలకరింపులు అయ్యాక, ఇద్దరికీ కాఫీలు తెచ్చి ఇచ్చింది. సుమతి. ‘‘అత్తయ్యా! ఈ రోజు ఆదివారం కదా. రాత్రికి భోజనం చెయ్యరు. ఏం టిఫిను చెయ్యమంటారు?’’ ‘‘మినపరుబ్బు కొంచెం ఉంటే తెచ్చానమ్మా. నూక కలిపిందే. నాకు చిన్న రొట్టి కాల్చి మిగతాది ఉదయం ఇడ్లీకి ఉంచు..’’ అంటూ తను తెచ్చినవన్నీ, బయటకు ఒక్కొక్కటీ పెట్టింది. పిల్లలకి సున్నుండలు, మధుకి ఇష్టమని జంతికలు, చెరుకు ముక్కలు, అనకాపల్లి ఫేమస్ చిన్న బెల్లం దిమ్మ, పచ్చళ్లు పేరిన నెయ్యి... ఇవన్నీ చూసి పిల్లలు సంబరపడిపోయారు. సుమతి అవన్నీ తీసి సర్దుతూ, ‘‘ఇవన్నీ ఎప్పుడు చేయించారత్తయ్యా?’’ ‘‘రమణ నిన్న చెప్పాడు, మధుకి ఫోన్ చేశాను, రేపు వస్తాడని. మీ చిన్నత్త రాత్రి చేయించింది. బెల్లం, మినప్పప్పు ఇంట్లో ఉన్నవే పట్టుకొచ్చాను. రాత్రికి కొంచెం గుమ్మడి వడియాలు వేయించు. పిల్లలు ఇష్టంగా తింటారు.’’ ‘‘మీరు అలా కాసేపు చేరబడండి. బస్సులో అలా కూర్చొనుంటారు’’ సామానులన్నీ ఫ్రిజ్‌లో పెట్టి, వంటగదిలోకి వెళ్లింది. తల్లి కొడుకు ఊరి సంగతులు మాట్లాడుకుంటూండగా గబగబా వంట చేసి, భోజనాలకు పిలిచింది. అత్తగారు తెచ్చిన ఆవకాయ పచ్చళ్లు, కమ్మని నెయ్యితో సంతృప్తిగా భోజనాలు చేశారు. పిల్లలిద్దరూ ముందు గదిలో మంచం మీద నానమ్మ పక్కలో చేరిపోయారు కథ చెప్పమని! జానకమ్మ వచ్చాక సుమతికి కొంత స్వస్తత కలిగింది. ఉదయం దేవునికి దీపం. కాయగూరలు తరగడం, సిరికి జడ వేయడం అవన్నీ ఆమె చేస్తుండబట్టి, కాస్త వంట దగ్గర సులువవుతుంది. అందరికీ టిఫిను కూడా చేయగలుగుతుంది. సాయంకాలం పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ల కోసం ఏదో ఒకటి తినడానికి ఉంటుంది. సుధ చెప్పిన విధంగా ఆ మూడు రోజులు కూడా పాటించినందుకు ఆవిడ కూడా ఇబ్బంది పడలేదు. చాలా రోజులకి, ఆఫీస్‌లో లంచ్ టైమ్‌లో సుధ సుమతిని కలిసింది. ‘‘హాయ్ సుమా! ఎలా ఉన్నావు. హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తున్నావు. ఏమిటి విశేషం?’’ కుర్చీ దగ్గర జరిపి కూర్చుంది సుమతి. ‘‘అక్కా!’’ సుధని అక్కా అని పిలుస్తుంది సుమతి. ‘‘అక్కా! నువ్వు చెప్పిన మర్నాడే అనుకోకుండా ఆవిడ్ని తేవల్సివచ్చింది. దేవుడే నీ నోట అనిపించాడేమో అనుకున్నాను’’ జరిగినవన్నీ చెప్పి,‘‘ఆవిడ వచ్చిన దగ్గర్నుంచీ, నాకు చాలా రిలీవ్ అయింది. ఇంటి గురించి, పిల్లల గురించి బెంగ తగ్గింది. తాళం సరిగ్గా వేశానో, గ్యాసు కట్టానో లేదో, పనమ్మాయి వచ్చిందో లేదో, పిల్లలు వచ్చి ఏం చేస్తున్నారో అని రకరకాల టెన్షన్లు. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పిల్లలు కూడా వాళ్ల నానమ్మ దగ్గర బాగా చేరికయ్యారు. చిన్న చిన్న పద్యాలు, దేవుని కథలు అన్ని నేర్చుకుంటున్నారు. పనమ్మాయి కూడా వస్తే దగ్గరుండి అన్ని పనులూ చేయిస్తున్నారు. మిల్లుకి పంపి పిండిమర పట్టించడం, గ్రైండరుకి పంపి పప్పు రుబ్బించడం, వీధిలోకి మంచి కూరలు వస్తే కొని ఉంచటం, ఉదయం వాకింగ్‌కి వెళ్లినట్లు పిల్లలతో కలసివెళ్లి పూజకు పూలు తెచ్చుకోవటం, కాయగూరలు తరిగి ఇవ్వటం... ఇలా చాలా విషయాల్లో నాకు సాయంగా ఉంటున్నారు. నా కన్నా ఆమె వంట కూడా బాగా చేస్తారు. నువ్వు చెప్పిన సలహా భగవంతుడు తీర్చినందుకు మీ ఇద్దరికీ వందనాలు. ఇంకో గుడ్ న్యూస్. మా ఊళ్లో ఇల్లు అమ్మి, ఇక్కడ ఫ్లాట్ తీసుకోమనీ, తనూ ఇక్కడే ఉండిపోతాననీ అన్నారు.’’ సుమతి చేయి పట్టుకుని సుధ షేక్‌హాండ్ ఇస్తూ, ‘‘నువ్వు అదృష్టవంతురాలివే. ఈ రోజుల్లో అత్తగార్ని బయటపెట్టే కోడల్ని చూశాను గానీ, అత్తగార్ని పొగిడే కోడల్ని నిన్నే చూస్తున్నాను. నీమీద జలసీ కలుగుతుందే. మా అత్త లేనందుకు. ఇంతకీ మీ అత్తగారి వయసెంతే?’’ ‘‘డెభ్భయ్.’’ ‘‘ఆ..?!’’ ‘‘ఏమిటలా ఆశ్చర్యపోతున్నావ్?’’ ‘‘ఏమీ లేదు. ఈ వయసులో కూడా అంత యాక్టివ్‌గా ఉన్నారంటే గ్రేట్. అందుకే అంటారు, ఇంటికో పెద్దతోడు ఉండాలని. పిల్లలు కూడా ఆమె దగ్గర పడుకోవడం మంచిదే. ఎదుగుతున్న వయసులో అది మంచి పద్ధతి. చిన్నప్పుడు తల్లి దగ్గర, కొంత ఎదిగాక, వాళ్లకి వేరే పక్కలు అమర్చాలి. ఈ విధంగా మీ అత్తగారు మీకు ఫ్రీడమ్ కూడా కల్పిస్తున్నారన్నమాట. సంతోషం! ఒకసారి ఆవిణ్ని చూడాలి.’’ ‘‘తప్పకుండా. ఈ సండే ఉదయాన్నే వచ్చీ. లంచ్ అక్కడే చేద్దూగాని. మా అత్తగారి చేతివంట కూడా రుచి చూద్దువుగాని. మీవారిని, అదే బావగారిని కూడా తీసుకురా. నేను ఫోను చేసి పిలుస్తాను. తప్పకుండా రండి. సరేనా?’’ ‘‘ఓకే.’’ ‘‘ఆవిడ వచ్చిన దగ్గర్నుంచీ, నాకు చాలా రిలీవ్ అయింది. ఇంటి గురించి, పిల్లల గురించి బెంగ తగ్గింది. తాళం సరిగ్గా వేశానో, గ్యాసు కట్టానో లేదో, పనమ్మాయి వచ్చిందో లేదో, పిల్లలు వచ్చి ఏం చేస్తున్నారో అని రకరకాల టెన్షన్లు. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పిల్లలు కూడా వాళ్ల నానమ్మ దగ్గర బాగా చేరికయ్యారు. చిన్న చిన్న పద్యాలు, దేవుని కథలు అన్ని నేర్చుకుంటున్నారు. -
ముగ్గుల పోటీలకు విశేష స్పందన
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: కర్నూలు నగరం మాధవనగర్ పార్కులో వైఎస్ఆర్సీపీ పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. 250 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. ఎక్కువ మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. పోటీల్లో పాల్గొనడం ద్వారా మహిళలు తమలోని నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ముగ్గులు వేసిన మహిళల జీవితం కూడా రంగులమయం కావాలని ఆకాంక్షించారు. మహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేవారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ముగ్గుల పోటీ కార్యక్రమం మధ్యాహ్నం దాకా కొనసాగింది. పోటీలకు హాజరైన వారందరికీ నిర్వాహకులు భోజన సదుపాయం కల్పించారు. కళాకారుడు రంగ స్టేజీ ప్రదర్శనలు అలరించాయి. వైఎస్సార్సీపీ కల్లూర్ అర్బన్ సిటీ కన్వీనర్ పెరుగు పురుషోత్తంరెడ్డి, బీసీసెల్ కన్వీనర్ పాతపాడు శ్రీనాథ్, జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ రాకేశ్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబరు వై.రామయ్య, రిటైర్డు టీచర్ ఆర్థర్ తదితరులు నిర్వాహకులుగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, బుడ్డా శైలజ, పెరుగు వేణుకళావతి, పాతపాడు వీణ, కాకర్ల సులోచన ముఖ్యఅతిథులుగా హాజరై నిర్వాహకులను అభినందించారు. సూర్యకుమారి, మణిమంజరి, డాక్టర్ విజయలక్ష్మి, ఇందిరాశాంతి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలు వీరే... హైమావతి (టోకన్ 11) మొదటి స్థానం, గౌతమి (2), శ్రీకళ (118) ద్వితీయస్థానం, ఎం.వెంకటలక్ష్మి (26), డి.వేదవతి (266), సంధ్య (400)లు మూడో స్థానంలో నిలిచారు. విజేతలకు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. శ్రీమఠంలో సినీ నటుడు వేణుమాధవ్ మంత్రాలయం, న్యూస్‌లైన్: శ్రీరాఘవేంద్రుల దర్శనార్థం సినీ హాస్యనటుడు వేణుమాధవ్ కుటుంబ సమేతంగా శనివారం మంత్రాలయం వచ్చారు. మఠం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు అర్చనలు చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. అక్కడి నుంచి రాఘవేంద్రుల మూలబృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 550 సినిమాల్లో నటించానన్నారు. సంప్రదాయం సినిమాతో రంగప్రవేశం చేశానన్నారు. దిల్, లక్ష్మీ, సింహాద్రి సినిమాలు నటుడిగా తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయని తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ నటిస్తున్న రేయ్, రుద్రమదేవి సినిమాలతో పాటు 12 కొత్త సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు. ఆయనతోపాటు మఠం పీఆర్వో విష్ణుతీర్థ, అసిస్టెంట్ పీఆర్వో వ్యాసరాజాచార్ తదితరులు ఉన్నారు. -
అదృశ్యం కాదు.. ఆత్మహత్య
-
అదృశ్యం కాదు.. ఆత్మహత్య
నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి శేషగిరిరావు భార్య అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆరు రోజుల క్రితం పుణ్యక్షేత్రాలకు వెళుతున్నానని ఫోన్లో చెప్పి అదృశ్యమైన నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ డి.శేషగిరిరావు భార్య విజయలక్ష్మి(45) ఇంట్లోని స్టోర్‌రూమ్‌లో శవమై కనిపించారు. ఇన్ని రోజులుగా విజయలక్ష్మి కోసం విస్తృతంగా గాలించిన కుటుంబ సభ్యులు చివరికి ఇంటి స్టోర్‌రూమ్ నుంచి దుర్వాసన రావడం గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె అదృశ్యం మిస్టరీ వీడింది. విజయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నం. 51లోని సెలైంట్ వ్యాలీ ఫ్లాట్ నం.1లో శేషగిరిరావు కుటుంబం నివసిస్తోంది. విజయలక్ష్మి గత నెల 28న తన భర్తకు ఫోన్ చేసి పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నానని చెప్పారు. ఆందోళనతో వెంటనే ఇంటికి తిరిగి వచ్చిన శేషగిరిరావుకు భార్య కనిపించలేదు. ఆ సమయంలో ఇంట్లో మరెవరూ లేరు. అనంతరం ఆమె కోసం బంధువులు, స్నేహితుల నివాసాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో గత నెల 30న శేషగిరిరావు చిన్న కూతురు వాసవి తన తల్లి కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బుధవారం మధ్యాహ్నం శేషగిరిరావు కూతురు స్టోర్ రూం నుంచి దుర్వాసన రావడాన్ని గుర్తించి తలుపులు తీయడానికి ప్రయత్నించినా తెరచుకోలేదు. దీంతో ఆమె తండ్రికి సమాచారం అందించడంతో శేషగిరిరావు పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం పోలీసులు శేషగిరిరావు ఇంటికి చేరుకొని స్టోర్ రూంను తెరిచి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న విజయలక్ష్మి మృతదేహం కనిపించింది. పక్కనే నిద్రమాత్రలు వేసుకున్న ఆనవాళ్లు కనిపించాయి. సూసైడ్ నోట్ కూడా లభించింది. పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గత నెల 28వ తేదీనే విజయలక్ష్మి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కాగా, విజయలక్ష్మిది ఆత్మహత్యేనని, ఇందులో ఎలాంటి సందేహాలు లేవని బంజారాహిల్స్ ఏసీపీ అశోక్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. విజయలక్ష్మి ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నదీ పోస్టుమార్టంలో తేలుతుందని తెలిపారు. ‘నాన్నా ... నువ్వు లేని లోకంలో ఉండలేను..’ విజయలక్ష్మి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో ‘నాన్నా నువ్వు లేని ఈ లోకంలో ఉండలేకపోతున్నాను. నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తున్నాను’ అని ఉన్నట్లు తెలిసింది. మూడు నాలుగేళ్లుగా విజయలక్ష్మి మానసిక పరిస్థితి బాగా లేదని ఆమె కుటుం బీకులు పోలీసులకు తెలిపారు. ఏడాది క్రితమే ఆమె తండ్రి చనిపోవడంతో కుంగుబాటుకు గురైందని... తరచూ తండ్రిని గుర్తుచేసుకుంటూ రోదించేదని చెప్పారు. -
కార్పొరేషన్లో కిరికిరి
= కమిషనర్ తీరుకు నిరసనగా ఉద్యోగుల మూకుమ్మడి సెలవు = అన్ని రకాల ప్రజా సేవలు బంద్ = విజయలక్ష్మి తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : ఒంగోలు నగర కమిషనర్ విజయలక్ష్మి తీరుపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో నగర పాలన స్తంభించింది. గతంలో రెండు నెలల పాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ప్రజా సేవలు బంద్కాగా ఇప్పుడు ఉద్యోగుల ఆధిపత్య పోరుతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నిత్యం వివిధ పనులపై కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వయంగా కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్న కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడం గమనార్హం. రచ్చకెక్కిన విభేదాలు కమిషనర్ విజయలక్ష్మి, ఉద్యోగుల మధ్య కొంతకాలంగా అంతర్గతపోరు సాగుతోంది. చివరకు ఉద్యోగులు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో విషయం రచ్చకెక్కింది. కమిషనర్ తీరు నిరసిస్తూ ఉద్యోగులంతా ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. బుధవారం మూకుమ్మడి సెలవులు పెట్టి విధులకు గైర్హాజరయ్యారు. అందరి సంతకాలతో కూడిన సెలవు చీటీని కమిషనర్‌కు అందించి ఒకరోజు సెలవు పెడుతున్నట్లు ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా అందరూ ఒకేసారి ఎలా సెలవు పెడతారని ఉద్యోగులను కమిషనర్ ప్రశ్నించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని కూడా ఆమె హెచ్చరించారు. ఉద్యోగుల మూకుమ్మడి సెలవుతో కార్యాలయంలోని అన్ని విభాగాల్లో సేవలు నిలిచిపోయాయి. కమిషనర్ మాత్రమే విధులు నిర్వహించారు. ఉద్యోగుల్లేకపోవడంతో కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వివిధ పనులపై వచ్చిన ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. కమిషనర్ వ్యవహార శైలిపై కార్పొరేషన్ ఉద్యోగులంతా కలెక్టర్ విజయ్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆమె వేధింపులు భరించలేకపోతున్నామని వినతి పత్రం అందించారు. ఎక్కడి ఫైళ్లు అక్కడే కార్పొరేషన్ కార్యాలయంలో అంతర్గతపోరుతో అన్ని విభాగాల్లోనూ ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలడం లేదు. దీంతో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు కుంటుపడిపోతుండగా కాంట్రాక్టర్లకు చె ల్లించాల్సిన బిల్లులు నిలిచిపోయాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరుకాక ప్రజలు కార్యాలయం చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఇక నిత్యం ఎదురయ్యే పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటి సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. చెప్పినా పరిష్కరిస్తారనే నమ్మకం ప్రజల్లో లేకుండా పోయింది. దీనికంతటికీ కారణం కమిషనర్ వ్యవహార శైలి అని ఉద్యోగులు ఆరోపిస్తుంటే, ఉద్యోగులే సక్రమంగా పనిచేయడం లేదని కమిషనర్ మండిపడుతున్నారు. కమిషనర్ వ్యవహారం పూర్తిగా తమను అవమానపరిచే విధంగా ఉందంటూ ఉద్యోగులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఒక్క ఫైల్‌ను కూడా ఉద్యోగులు సక్రమంగా రూపొందించడం లేదని కమిషనర్ చెబుతున్నారు. సక్రమంగా పనిచేయమనడం తప్పా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వీరి అంతర్గతపోరుతో చివరికి ఇబ్బంది పడుతోంది సామాన్యులే. చాలాకాలం నుంచి కార్యాలయంలో జరుగుతున్న అంతర్గతపోరును ప్రత్యేకాధికారిగా కలెక్టర్ విజయ్‌కుమార్‌తో పాటు మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. చక్రం తిప్పుతున్న కాంట్రాక్టర్లు కమిషనర్, ఉద్యోగుల మధ్య వివాదానికి కాంట్రాక్టర్లే కారణమన్న ప్రచారం కూడా జరుగుతోంది. పనులకు సంబంధించి బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉండటం, ఆ ఫైళ్లపై కమిషనర్ సంతకాలు చేయకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా ఉద్యోగులను నడిపిస్తున్నారనే విమర్శలు కాంట్రాక్టర్లపై వ్యక్తమవుతున్నాయి. దాదాపు కోటి రూపాయల వరకు కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. కార్పొరేషన్ వివాదంపై ఆర్ డీ విచారణ నగర కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ విజయలక్ష్మికి, ఉద్యోగులకు మధ్య సాగుతున్న వివాదంపై మున్సిపల్ ఆర్డీ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న వివాదంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు బుధవారం సాయంత్రం కార్యాలయానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ బుధవారం ఉద్యోగులంతా మూకుమ్మడి సెలవు పెడుతున్నారనే సమాచారం అందిందని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ అధికారిగా పంపారని చెప్పారు. ఈ వివాదంపై అటు ఉద్యోగులతో, ఇటు కమిషనర్‌తో ఇద్దరితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటానన్నారు. కమిషనర్, ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నాయన్నారు. కార్యాలయంలో అంతర్యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వీటన్నింటిపై పూర్తి సమాచారం సేకరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా పారిశుధ్య విభాగానికి చెందిన ఉద్యోగులను ఆయన ప్రశ్నించారు. కమిషనర్‌తో ఏమైనా ఇబ్బందులుంటే లిఖిత పూర్వకంగా రాసివ్వాలని కోరారు. అయితే సదరు ఉద్యోగులు మాత్రం కమిషనర్‌తో తమకు ఎటువంటి ఇబ్బందీ లేదని, కేవలం అసోసియేషన్పరంగా సమావేశం నిర్వహిస్తున్నామంటేనే మంగళవారం సమావేశానికి వచ్చామని సమాధానమిచ్చారు. అయితే బుధవారం ఉద్యోగుల మూకుమ్మడి సెలవులో వీరూ విధులకు గైర్హాజరవడం గమనార్హం. మొత్తం ఎంతమంది సెలవు పెట్టారనే విషయాన్ని పరిశీలిస్తామని ఆర్డీ శ్రీనివాస్ తెలిపారు. కార్యాలయ విభేదాలపై ఇరుపక్షాలతో మాట్లాడి పూర్తి నివేదికను ఉన్నతాధికారులు అందజేస్తానని వివరించారు. అనంతరం ఆయన ఉద్యోగులు, కమిషనర్ విజయలక్ష్మితో చర్చలు జరిపారు.