
యశవంతపుర (కర్ణాటక): అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటి విజయలక్ష్మీ.. తనను నటుడు రవి ప్రకాశ్ మానసికంగా లైంగికంగా వేధించిన్నట్లు పుట్టేనహళ్లి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. తను కొద్దిరోజుల నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఫిబ్రవరి 27న నటుడు రవిప్రకాశ్ ఆస్పత్రికీ వచ్చి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. అనంతరం ప్రతిరోజూ ఐసీయూకు రావడం, పదేపదే ఫోన్ మేసెజ్‌లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించేవారన్నారు. ఈ మేరకు ఆమె కన్నీరు పెట్టుకుని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వైరల్‌గా మారింది.
వేధించలేదు: రవిప్రకాశ్
ఆమె ఆరోపణలను నటుడు రవి ప్రకాశ్ ఖండించారు. మీడియాలో సాయం చేయాలని కోరటం వల్ల ఆమెకు లక్ష రూపాయలను సాయం చేశాను గానీ లైంగికంగా వేధించలేదని చెప్పారు. ఆమెతో తను మాట్లాడిన కాల్ రికార్డ్ ఉందన్నారు. కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయటమే తప్పా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment