కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: కర్నూలు నగరం మాధవనగర్ పార్కులో వైఎస్‌ఆర్‌సీపీ పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. 250 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. ఎక్కువ మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. పోటీల్లో పాల్గొనడం ద్వారా మహిళలు తమలోని నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ముగ్గులు వేసిన మహిళల జీవితం కూడా రంగులమయం కావాలని ఆకాంక్షించారు. మహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేవారు.
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ముగ్గుల పోటీ కార్యక్రమం మధ్యాహ్నం దాకా కొనసాగింది. పోటీలకు హాజరైన వారందరికీ నిర్వాహకులు భోజన సదుపాయం కల్పించారు. కళాకారుడు రంగ స్టేజీ ప్రదర్శనలు అలరించాయి. వైఎస్సార్సీపీ కల్లూర్ అర్బన్ సిటీ కన్వీనర్ పెరుగు పురుషోత్తంరెడ్డి, బీసీసెల్ కన్వీనర్ పాతపాడు శ్రీనాథ్, జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ రాకేశ్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబరు వై.రామయ్య, రిటైర్డు టీచర్ ఆర్థర్ తదితరులు నిర్వాహకులుగా ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, బుడ్డా శైలజ, పెరుగు వేణుకళావతి, పాతపాడు వీణ, కాకర్ల సులోచన ముఖ్యఅతిథులుగా హాజరై నిర్వాహకులను అభినందించారు. సూర్యకుమారి, మణిమంజరి, డాక్టర్ విజయలక్ష్మి, ఇందిరాశాంతి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
విజేతలు వీరే...
హైమావతి (టోకన్ 11) మొదటి స్థానం, గౌతమి (2), శ్రీకళ (118) ద్వితీయస్థానం, ఎం.వెంకటలక్ష్మి (26), డి.వేదవతి (266), సంధ్య (400)లు మూడో స్థానంలో నిలిచారు. విజేతలకు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా బహుమతులు
అందజేశారు.
శ్రీమఠంలో సినీ నటుడు వేణుమాధవ్
మంత్రాలయం, న్యూస్‌లైన్: శ్రీరాఘవేంద్రుల దర్శనార్థం సినీ హాస్యనటుడు వేణుమాధవ్ కుటుంబ సమేతంగా శనివారం మంత్రాలయం వచ్చారు. మఠం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు అర్చనలు చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. అక్కడి నుంచి రాఘవేంద్రుల మూలబృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 550 సినిమాల్లో నటించానన్నారు. సంప్రదాయం సినిమాతో రంగప్రవేశం చేశానన్నారు. దిల్, లక్ష్మీ, సింహాద్రి సినిమాలు నటుడిగా తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయని తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ నటిస్తున్న రేయ్, రుద్రమదేవి సినిమాలతో పాటు 12 కొత్త సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు. ఆయనతోపాటు మఠం పీఆర్వో విష్ణుతీర్థ, అసిస్టెంట్ పీఆర్వో వ్యాసరాజాచార్ తదితరులు ఉన్నారు.
ముగ్గుల పోటీలకు విశేష స్పందన
Published Sun, Jan 12 2014 4:34 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement
Advertisement